Rakul Preet Singh:టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో కెరియర్ లో మొదటి హిట్ కొట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు సొంతం చేసుకుంటూ టాప్ చైర్ లోకి దూసుకొచ్చింది.
ఇక తెలుగులో ఆమె చివరిగా కొండపొలం సినిమాలో నటించింది. అంతకుముందు ఓ మూడు హిందీ సినిమాలలో చేసి హిట్టు కొట్టిన రకుల్ ప్రీతిసింగ్ కి తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయిన ఈ అమ్మడు ఇక తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు.
గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఇక హిందీలో అటు సీనియర్ స్టార్ హీరోలతో ఇటు యంగ్ హీరోలతో వరుసగా జతకడుతూ మూవీస్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా తమిళ్, హిందీ కలిపి ఐదు సినిమాల వరకు ఉన్నాయి.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ డోస్ పెంచింది అని చెప్పాలి. అక్కడ పోటీలో నిలబడాలంటే కచ్చితంగా అందాల ప్రదర్శనలో కూడా బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసుకొని విధంగా ఉండాలి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సందడి చేస్తూ ఉండాలి.
ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా రెగ్యులర్ గా హాట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ కు వినోదం అందిస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో నటుడు నిర్మాత జాకీ బాగ్నానితో గత కొంతకాలంగా రకుల్ ప్రేమాయణం సాగిస్తున్న సంక్రాంతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందని తెలుస్తుంది.