Rajinikanth : గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లాల్ సలామ్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ పై వస్తున్న ట్రోన్స్ పై కూతురు ఐశ్వర్య చేసిన కామెంట్స్ నెట్టింట్లో తీవ్ర దుమారం రేపాయి. తన తండ్రిని సంఘీ అంటూ విమర్శలు చేస్తున్నారని ఆమె భావోద్వేగమైంది. నా తండ్రి సంఘీ కాదని అలా అయితే.. ఆయన ‘లాల్ సలామ్’ మూవీలో అసలు నటించేవారు కాదని తెలిపింది. ఈ మాటలు విన్న సూపర్ స్టార్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న మూవీ లాల్ సలాం. ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు రజనీకాంత్. ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఐశ్వర్య ఇప్పటికే తెలిపింది. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ లు నటిస్తున్నారు. లాల్ సలాం మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా లాల్ సలాం రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యనే ఆడియో లాంచ్ ఈవెంట్ చైన్నెలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య తన తండ్రిని ఉద్దేశించిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రజనీకాంత్ తన కూతురు మాటలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేట్టైయాన్ మేవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కడప వెళ్లారు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తన కూతురు ఐశ్వర్య మాట్లాడిన సంఘీ అంశం గురించి విలేఖరులు ప్రశ్నించగా సంఘీ అంటే చెడ్డ పదం కాదని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఐశ్వర్య ఉద్దేశం కూడా సరైనదేనని తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆయన తెలిపారు. తన తండ్రి ఒక ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అని.. ఎందుకు అలాంటి దృష్టితో చూస్తారని మాత్రమే ఐశ్వర్య అనిందని తెలిపారు. అంతే కాదు ఈ డిస్కషన్ లాల్ సలాం మూవీ ప్రమోషన్ కోసం మాత్రం కాదని తేల్చిచెప్పారు. లాల్ సలాం మూవీ చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 9న విడుదలకు రెడీగా ఉంది అని అన్నారు.