Rainy Season:వర్షాకాలం మొదలవడంతో పెద్ద ఎత్తున వాతావరణంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అధిక వర్షాలు కారణంగా ఎన్నో రకాల వ్యాధులు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. ఇలా ఈ వ్యాధుల నుంచి మనం బయటపడాలి అంటే ఎన్నో జాగ్రత్తలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటి ఆ వ్యాధుల నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే…
వర్షాకాలంలో ఎక్కువగా నీరు నిల్వ ఉండటం వల్ల టైఫాయిడ్ మలేరియా జలుబు దగ్గు జ్వరం, కలరా ఫ్లూ వంటి సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి.వర్షాకాలంలో నీరు కలుషితం అవడం అలాగే నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరగటం వల్ల ఈ విధమైనటువంటి వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందుగా మన పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ నీరు నిలవకుండా చూసుకోవాలి అలాగే వర్షాకాలంలో నీటిని కాంచి చల్లార్చుకొని తాగటం వల్ల ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.
Rainy Season
ఇక ఇంట్లోకి దోమలు రాకుండా మస్కిటో కాయిల్స్, నెట్, ఆల్ అవుట్ వంటి వాటిని ఉపయోగించి దోమలను నివారించాలి. ఇతరులు ఉపయోగించిన వస్తువులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించకూడదు. అలాగే మిగిలిపోయిన ఆహార పదార్థాలను మరుసటి రోజు తినకూడదు. ఇక తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం వల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధులను పూర్తిగా నియంత్రించవచ్చు.