Radish: మన ఆహార పదార్థాలలో భాగంగా తరచూ ముల్లంగి తీసుకుంటాము. ముల్లంగి తరచూ తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతో పాటు కంటి చూపును చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు గుండె జబ్బు, రక్తపోటు, డయాబెటిస్ ,మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఉదర క్యాన్సర్, వంటి ఎన్నో రకాల వ్యాధులను అదుపులో ఉంచవచ్చు.
ఇందులో ఎన్నో రకాల విటమిన్లు,పోషక పదార్థాలు ఉన్నాయి. ముల్లంగి ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ముల్లంగి తిన్న తరువాత కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల ఎంతో ప్రమాదం కూడా జరుగుతుంది.
ముల్లంగి కూర తిన్న వెంటనే పాలు తాగితే మన శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని కడుపులో మంట,తేపులు, గుండెల్లో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.సాధారణంగా ముల్లంగిని చేదు రుచి కలిగిన ఎటువంటి పదార్థంతోను కలిపి తినకూడదు. ముల్లంగిలో ఉండే సహజ ఔషధ గుణాలు చేదుతో కలిసినప్పుడు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.
Radish:
ముల్లంగిని తిన్న వెంటనే పాలు,టీ, కాఫీ వంటి వాటిని తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తలెత్తవచ్చు. నారింజ, బత్తాయి, కివి బొప్పాయి పండ్లను తిన్న వెంటనే ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే ఈ రెండిటి కలయిక మన శరీరంలో విషంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీర దోసకాయతో కలిపి ముల్లంగిని తింటే డిహైడ్రేషన్ సమస్య తలెత్తి తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. ఇక ముల్లంగి తినే వారు ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.