Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తెరకెక్కుతూ ఉంది. భారీ బడ్జెట్ తో రెడీ అవుతున్న ఈ మూవీ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక హై వాల్యూమ్ ఉన్న కథలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే యూనివర్శల్ అప్పీల్ ఉండే కథలతో హీరోయిజం ఎలివేట్ చేస్తూ సినిమాని ఆవిష్కరిస్తే బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే కేజీఎఫ్ లాంటి మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఆర్ఆర్ఆర్, బాహుబలి సిరీస్ లు కూడా మంచి విజయం అందుకున్నారు. ఈ కథలు అన్ని కూడా నేటివిటీని దాటుకొని అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో తెరకెక్కాయి.
అందుకే సూపర్ సక్సెస్ అయ్యాయి. పుష్ప మూవీ కూసా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్. స్మగ్లింగ్ అనే యూనివర్శల్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. అయితే దసరా సినిమా హిందీ ఆడియన్స్ ని రీచ్ కాకపోవడానికి కారణం కంప్లీట్ గా తెలంగాణ నేటివిటీలోనే కథని చెప్పడం. ఇదిలా ఉంటే పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ టీజర్ ఏకంగా 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీనిని బట్టి ఈ సినిమాపై ఎంత బజ్ ఉందో అంచనా వేయవచ్చు. అయితే ఈ స్థాయిలో బజ్ ఉన్న సినిమా నుంచి ప్రేక్షకులు భారీగానే టీజర్ ఎక్స్ పెక్ట్ చేస్తారు.
అయితే సుకుమార్ మాత్రం రొటీన్ కమర్షియల్ ఫార్ములా పాతకాలం ఎలివేషన్స్ తో డిజపాయింట్ చేసాడనే మాట వినిపిస్తుంది. స్మగ్లింగ్ డాంగ్ గా మారిన పుష్పరాజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం, అలాగే తానో మహాత్ముడు, దోచుకున్న సొమ్ముతో ప్రజలకి మంచి చేస్తున్నాడు అనే రేంజ్ లో చూపించరు. ఇది చూసిన తర్వాత ప్రేక్షకులు కంప్లీట్ గా డిజపాయింట్ అయిపోయారు. ఇదే ప్లాట్ తో ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై వందల సినిమాలు వచ్చేసాయి.
మంచోడుగా హీరోని చూపిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారు అనే బాక్స్ నుంచి సుకుమార్ పుష్పరాజ్ ని బయటకి తీసుకురాలేకపోయాడనే మాట వినిపిస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 2లో రాఖీభాయ్ లో మంచి క్లైమాక్స్ లో తప్ప ఎక్కడ ప్రాజెక్ట్ చేయలేదు. అతనిని తన స్వార్ధం కోసం బ్రతికే వ్యక్తిగానే చూపించాడు. అలాగే అతను అంత కరుడుగట్టిన స్వార్ధపరుడుగా మారడానికి బలమైన కారణం చూపించారు. అయితే పుష్ప2లో అది మిస్ అయినట్లు కనిపిస్తుంది. మరి సుకుమార్ ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీక్ బ్యాక్ తీసుకొని కొత్తగా ట్రై చేస్తాడా లేదా అదే మూస ధోరణిలో చేస్తాడా అనేది చూడాలి.