Categories: EntertainmentLatest

Pushpa 2 : సూసేకి అగ్గిరవ్వే..రచ్చ రచ్చ చేస్తున్న రష్మిక పాట

Pushpa 2 : ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సుకుమార్ ప్రమోషన్లతో ఫ్యాన్స్ ను పరేషాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా పుష్ప2 నుంచి ఓ గ్లింప్స్, ఓ సాంగ్ ఒదిలా అభిమానుల్లో, సినీ ప్రియుల్లో అంచనాలను భారీగా పెంచేశాడు. అల్లు అర్జున్ సాంగ్ పుష్ప పుష్ప సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఫ్యాన్స్ పూనకాలతో ఓ రేంజ్ లో ఊగిపోయారు. ఇక ఈ పాట స్టెప్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ సింగల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే కపుల్ సాంగ్ విడుదలైంది. లిరిక్స్​కు స్టైలిష్ కాస్ట్యూమ్​లో అల్లు అర్జున్ తో కలిసి శ్రీవల్లి స్టెప్పులేసి అదరగొట్టింది. ఈ పాటతో రష్మిక తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చినట్లైంది.ఈ కపుల్ సాంగ్ రిలీజైన కాసేపట్లోనే ట్రేండింగ్ లో నిలిచింది.

pushpa-2-rashmika-mandanna-allu-arjun-couple-song-released

తెలంగాణ ఫేమస్ రైటర్,ఆస్కార్ అవార్డ్ విన్నర్​ చంద్రబోస్ సూసేకి అగ్గిరవ్వే పాటకు లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను బాలీవుడ్ టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడింది. ‘తగ్గేదేలే’ అనే మేనరిజంతో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ లో సింపుల్ స్టేప్స్​తో బన్ని, రష్మిక ఈ పాటకు డ్యాన్స్​ ఇరగదీశారు. ఫస్ట్ షార్ట్ లో రష్మికను డీగ్లామర్​గా చూపించినా ఈపాటలో స్టైలిష్​లుక్​లో కనిపించింది. పాట్ రిలీజైన గంటలోపే 5 లక్ష్యల వ్యూస్ దాటి రేసు గుర్రంలా దూసుకెళ్తోంది.

pushpa-2-rashmika-mandanna-allu-arjun-couple-song-released

పుష్ప సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించి రికార్డ్ క్రియేట్ చేసిన రాక్​స్టార్ దేవీ శ్రీ ప్రసాదే పుష్ప2కు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్​, సునీల్, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పుష్పలో ఉన్నట్లే ఈ మూవీలోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ తృప్రి దిమ్రి ని దింపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ, దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఈ మూవీ కచ్చితంగా రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని టాక్.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.