Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఈ మూవీ పుష్పకి సీక్వెల్ గా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న ఈ మూవీకి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేసేందుకు సుకుమార్ రెడీ అయ్యారు. అయితే అంతకంటే ముందుగా తాజాగా చిత్రం నుంచి ఇంటరెస్టింగ్ టీజర్ ప్రోమోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తిరుపతి జైలు నుంచి గాయాలతో తప్పించుకున్న పుష్ప ఎక్కడ? అంటూ న్యూస్ లో వచ్చే వాయిస్ తరహాలో ప్రెజెంట్ చేశారు.
తరువాత జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, ఆందోళనలు చేయడం, పోలీసుల లాఠీచార్జ్ లాంటి ఎలిమెంట్స్ ని విజువల్ లో ఆవిష్కరించారు. ఇక పుష్ప ఫోటో మీద క్వశ్చన్ మార్క్ పెట్టి ఆవిష్కరించారు. దీనిని బట్టి టీజర్ మరింత హై ఎండ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక పుష్ప 2 మూవీలో స్మగ్లింగ్ డాన్ గా పుష్పరాజ్ ఎలా మారాడు అనేది చూపించబోతున్నట్లుగా ఈ ప్రోమో బట్టి అర్ధం అవుతుంది.
ఇక ఏప్రిల్ 7న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ని రిలీజ్ చేసి మరింతగా పార్ట్ 2 మూవీ ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా రష్మిక మందన బర్త్ డే కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప నుంచి ఆమె లుక్ కి సంబందించిన పోస్టర్ కూడా వదలడం విశేషం. మరి ఈ టీజర్ పుష్ప2 మీద ఏ స్థాయిలో అంచనాలు పెంచుతుంది అనేది చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.