Future Jobs: భవిష్యత్తులో ఏ ఉద్యోగాలకి డిమాండ్ ఎక్కువ ఉంటుందంటే?

Future Jobs: మారుతున్న కాలంతో పాటు ఆధునిక మానవుడి జీవన శైలి మారుతుంది. టెక్నాలజీ వినియోగం భాగా పెరిగింది. అలాగే కొన్ని రకాల ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి. వాటి స్థానంలో కొత్త కొత్త ఉద్యోగాలు తెరపైకి వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా మానవ సమాజంలోకి కొత్త ఉద్యోగాలు వస్తాయి. మానవ వనరులని మరొక్క మార్గంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉపయోగించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అనేది భవిష్యత్తులో సాంకేతిక ప్రపంచంలో అత్యంత విలువైన, అవసరమైన పరిజ్ఞానంగా మారుతుంది. మరి భవిష్యత్తులో అత్యంత ఎక్కువ సంపాదన అధించే ఉద్యోగాలు ఎవై ఉంటాయి అనే విషయం అద్యయనం చేస్తే  అందులో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కీలక భూమిక పోషించేవి ఉండటం విశేషం. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్: వివిధ పరిశ్రమలలో పెరుగుతున్న ఎఐ సాంకేతికతలను అలవాటు చేసుకొని, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో పరిష్కారాలను రూపొందించగల, అభివృద్ధి చేయగల నిపుణుల డిమాండ్ పెరుగుతోంది.

 

డేటా సైంటిస్ట్: భవిష్యత్తులో సోషల్ మీడియాలో డేటా విపరీతంగా పెరుగుతూనే ఉన్నందున, వాటిని విశ్లేషించేందుకు, డేటా సేకరించేందుకు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి డేటా శాస్త్రవేత్తలకు అధిక డిమాండ్ ఉంది.

 

సైబర్ సెక్యూరిటీ నిపుణులు: సాంకేతికత విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతగా పెరుగుతాయి. వ్యాపారాలని దెబ్బ తీయడానికి, అలాగే కంపెనీల బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి సైబర్-దాడుల పెరుగుతున్న నేపధ్యంలో అనధికారిక యాక్సెస్ సైబర్ దాడుల నుంచి డేటా, నెట్‌వర్క్‌లు,  సిస్టమ్‌లను రక్షించగల సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకి అధిక డిమాండ్‌ ఉంటుంది..

వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ డెవలపర్: వర్చువల్ రియాలిటీ అనేది సాంకేతిక మరో అత్యాదినిక అభివృద్ధి. వర్చువల్ అనుభవాలు, ఇంటరాక్టివ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్‌ల వినియోగం భవిష్యత్తులో పెరుగుతుంది. వర్చువల్ రియాలిటీ ద్వారా దృశ్య రూపంలో తమకి కావాల్సిన వారితో సంభాషించే విధానం భవిష్యత్తులో పెరుగుతుంది. ఇలాంటి టెక్నాలజీ డెవలపర్‌లకి  డిమాండ్ పెరుగుతోంది.

సస్టైనబుల్ ఎనర్జీ స్పెషలిస్ట్: పర్యావరణ స్థిరత్వం, ఉత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించడంతో, సౌర, విండ్, జలవిద్యుత్ వంటి స్థిరమైన శక్తి పరిష్కారాలను అభివృద్ధి చేయగల నిపుణుల కోసం డిమాండ్ పెరుగుతోంది.

 

హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్: వృద్ధాప్య జనాభా, పెరుగుతున్న అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం హాస్పిటల్స్ మీద ఆధారపడతాం. ఈ నేపధ్యంలో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ఇతర అనుబంధ ఆరోగ్య నిపుణులకు అధిక డిమాండ్‌ ఉంటుంది

బ్లాక్‌చెయిన్ డెవలపర్: బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇది రికార్డ్ కీపింగ్ కోసం ఉపయోగించబడుతుంది, ఇది వివిధ పరిశ్రమలలో ఇప్పటికే దీనిని అభివృద్ధి చేస్తున్నారు. బ్లాక్‌చెయిన్ ఆధారిత అప్లికేషన్‌లను సృష్టించగల నైపుణ్యం కలిగిన బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లకు అధిక డిమాండ్ ఉంది.

Varalakshmi

Recent Posts

Rashmika Mandanna : రష్మిక వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్

Rashmika Mandanna : భారత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి…

7 hours ago

Prabhas : ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు?..ప్రభాస్ ట్వీట్ వైరల్

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‎కు అదిరిపోయే గుడ్ న్యూస్ . ఉన్నట్లుండి డార్లింగ్ సోషల్ మీడియాలో…

10 hours ago

Actor Prakash : మరీ అంతలా దిగజారిపోకండి

Actor Prakash : మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ హీరో జివి ప్రకాష్ కుమార్ ఈ మధ్యనే తన భార్య సింగర్…

1 day ago

Lavanya tripathi : మెగా కోడలిని ఏకిపారేస్తున్న జనం

Lavanya tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్…

1 day ago

Anushka : ఆ నిర్మాతతో అనుష్క పెళ్లి?

Anushka : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి అనుష్క శెట్టి. నాగార్జున హీరోగా…

2 days ago

Ice cream: ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఈ పదార్థాలను తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

Ice cream: వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా చల్ల చల్లని పానీయాలు ఐస్ క్రీములు తినాలని…

2 days ago

This website uses cookies.