Categories: EntertainmentLatest

Prabhas : ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు?..ప్రభాస్ ట్వీట్ వైరల్

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‎కు అదిరిపోయే గుడ్ న్యూస్ . ఉన్నట్లుండి డార్లింగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అభిమానులను సర్‎ప్రైజ్ చేశాడు. వ్యక్తిగతంగా ఇంట్రోవర్ట్ అయిన ప్రభాస్ బయట కనిపించడమే ఎక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అనే చెప్పాలి. అలాంటిది ప్రభాస్ తన ఇన్‎స్టాగ్రామ్ లో అందరూ అవాక్కయ్యేలా ఓ పోస్ట్ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ రాబోతోందని అంటున్నాడు.దీంతో ఫ్యాన్స్ ఏంటా విషయం అని తెలుసుకునేందుకు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.

prabhas-special-person-to-come-just-wait-darling-tweet-goes-viral

దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘బాహుబలి’సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి ఊపిరి సలపనంతగా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు డార్లింగ్ . గతేడాది ‘సలార్’తో భారీ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన డార్లింగ్ త్వరలో ‘కల్కి’గా రాబోతున్నాడు. జూన్ 27న బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా విడుదలకు మరో 40 రోజులు మాత్రమే ఉంది. మరి ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు. మా జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు జస్ట్ వెయిట్ అని ప్రభాస్ పోస్ట్ పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ తన భార్యను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడా అంటు రకరకాల కామెంట్లు దర్శనమిస్తున్నాయి.

prabhas-special-person-to-come-just-wait-darling-tweet-goes-viral

నిజానికి ప్రభాస్ పెళ్లి గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఏడాది తన పెళ్లిని డార్లింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. అప్పట్లో నటి అనుష్కతో ప్రభాస్ లవ్ లోఉన్నాడని..వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. ఇక ఆదిపురుష్ సినిమా సమయంలో హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఏమీ లేదని కృతి తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో డార్లింగ్ పెట్టిన పోస్ట్ తన పెళ్లి గురించే అంటూ అభిమానులు భావిస్తున్నారు. అన్నా ఈ ట్విస్ట్ ఏంటన్నా? తొందరగా చెప్పన్నా అంటూ టెన్షన్ తట్టుకోలేకపోతున్న అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

5 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

5 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

5 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

4 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.