Puri Jagannadh : సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన రాజమౌళి, పూరి జగన్నాద్ లను ఎవరైనా ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాల్సిందే. ఇక వీరిద్దరిలో ఎవరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా రాజమౌళినే. ఎందుకంటే సినిమా మేకింగ్ విషయంలో పూరి దగ్గర సహాయకుడిగా చేరాలని ఉందంటూ తన మనసులోని మాటను జక్కన్న ఓ సందర్భంలో బయట పెట్టారు. ఒక్క సినిమాల మేకింగ్ విషయంలోనే కాదు డబ్బు సంపాదించడంలో.. మనుషులను ద్వేషించడంలో.. జంతువులను ప్రేమించడంలో.. సినిమాతో జీవించడంలో. ఇలా ఎన్నో విషయాలలో ఎంతో మంది పూరి జగన్నాధ్ ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఆయనతో లవ్‌లో పడతారు.
ఆయన చెప్పే కొటేషన్స్ ఎంతో మందిని ఆలోచింపచేస్తాయి. ‘నిజమే’.. అని కన్విన్స్ చేస్తాయి. డిప్రషన్ లో ఉన్న వాడి మత్తు మదిలిస్తాయి. పూరి సినిమాలో హీరో క్యారెక్టర్ చాలు జీవిత కాలం దమ్మున్న వాడిలాగా బ్రతకడానికి. దేవుణ్ణి ఎలా ప్రశించాలో చెబుతాడు..ఆడదాన్ని ఎలా చూడాలో ..ప్రేమించాలో నేర్పుతాడు. కొడుకైనా సరే నా ఆస్తి కోసం ఎదురుచూడకూడదు..ఆరాటపడ కూడదు.. అని నిర్మొహమాటంగా చెప్తాడు. పక్కనున్న స్నేహితుడే వెన్నుపోటు పొడుస్తున్నా..చూస్తూ చిరునవ్వుతో ఓ చూపు చూస్తాడు. అది చాలు ఎవడి జీవితానికైనా.
Puri Jagannadh : పూరి ఆలోచన ‘నా నెక్స్ట్ సినిమా కథేంటి..హీరో ఎవరు’..
కేవలం మాటలతోనే తన గురువు(ఆర్జీవీ) రుణం తీర్చుకుంటాడు. కష్టమైనా ఇష్టమొచ్చిన, మనసుకు నచ్చిన పనే చేస్తాడు. అందులోనే టన్నులకొద్దీ ఆనందం ఉందని ప్రపంచానికి చెప్తాడు. రాత్రిళ్ళు ఎంజాయ్ చేయాలంటే సినిమాలకో, ఫ్రెండ్ తో మందు కొట్టడానికో, అమ్మాయితో సరదాగా గడపడానికో వెళ్ళనవసరం లేదు. పూరి మ్యూజింగ్స్ వింటూ ఆ రాత్రి గడిపితే చాలు, ఆ రోజు ఏమీ తినాలనిపించనంతగా కడుపు నిండిపోద్ది. ఇలాంటి మాస్టర్ జీవితంలో తారసపడటం అదృష్టం.
ఇండస్ట్రీకొచ్చి ఓ దర్శకుడిగా 100 కోట్లు సంపాదించాడు. అది మొత్తం పోయి రోడ్డున పడ్డ క్షణం కూడా పూరి ఆలోచన ‘నా నెక్స్ట్ సినిమా కథేంటి..హీరో ఎవరు’..అనే. దటీజ్ పూరి జగన్నాద్. ‘పోగొట్టుకుంటేనే కదా దేని విలువైనా తెలిసేది.. ఒళ్ళు దగ్గర పెట్టుకునేది’..అనే అద్భ్తమైన ఫిలాసఫీ చెప్పిన జగన్..లా మేము ఉండలేము. మళ్ళీ జన్మంటూ పూరి జగన్నాద్ లా పుట్టాలనుకునే దర్శకులు..అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలా పుట్టినా ఆయన బ్రతకడం..నవ్వడం అందరికీ సాధ్యపడదు. ఇంకో జన్మ అనేది మనిషికి ఉంటుందో లేదో తెలీదు గానీ, ఈ జన్మకి మాత్రం ఒక్క పూరికే సాధ్యం.