Priyanka Mohana : అందం ఉంటే సరిపోదు అందుకు తగ్గట్లుగా అదృష్టం కూడా ఉండాలి. అదిలేకే పాపం తమిళ కుట్టీ ప్రియాంక మోహన్ తెలుగు ఇండస్ట్రీలో రాణించలేకపోయింది. నానితో గ్యాంగ్‌లీడర్, శర్వాతో శ్రీకారం సినిమాలు చేసినా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్‌టాక్‌ను సొంతం చేసుకోకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో తన అదృష్టాన్ని చెన్నైలో పరిక్షీంచుకుంటోంది ఈ బ్యూటీ. డాక్టర్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అక్కడ మంచి అవకాశాలనే అందిపుచ్చుకుంటోంది. అమ్మడి అదృష్టం సొంతనేలపై బాగానే ఉందని చెప్పాలి గత ఏడాది సూర్యతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈటి సినిమాలో తన యాక్టింగ్‌తో అందంతో తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ బ్యూటీ.
ప్రియాంక సొంతూరు తమిళనాడు. చైన్నైలోనే స్టడీస్ పూర్తి చేసింది. థయేటర్ ఆర్ట్స్ తో డిగ్రీ చేసిన ప్రియాంక సినిమాలవైపు మొగ్గు చూపింది. మొదటి ప్రయత్నంగా మలయాళ చిత్రంలో కనిపించింది అయితే అక్కడి ఈ మూవీకి ఆదరణ రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి వలస వచ్చింది. ఇక్కడ కూడా బెడిసికొట్టడంతో ఇఫ్పుడు తమిళంలో సెటిల్ అయ్యింది. అయితే తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తన అందాల ఫోటోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది. తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్లు గ్లామర్ గా కనిపించని ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన అందాలు హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసమే ఈ చిన్నది ఇలా చేస్తోందని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
గ్లామర్ తో పాటు లక్ ఉన్న హీరోయిన్స్‌కే ఏ ఇండస్ట్రీలో అయినా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అయితే ఈ విషయంలో ప్రియాంక మాత్రం కాస్త వెనుకబడిందనే చెప్పాలి. ఈ అమ్మడికి అందం, అభినయం ఉన్నా అందుకు తగ్గ అదృష్టం లేదు.
అయితే అలా అని సైలెంట్ అయిపోలేదు. పోగొట్టుకున్న దగ్గరే రాణించాలనుకుంటోంది ఈ చిన్నది అందుకే అన్ని ఇండస్ట్రీల్లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే పనిలో పడింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ బ్యూటీకీ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ఉపయోగించుకుని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ తో అయినా టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్లల్లో పడాలనుకుంది కాబోలు బ్యాక్ లెస్ టాప్ వేసుకుని ఉల్లిపొరలాంటి స్కర్ట్ ధరించి తన అందాలను చూపించి చూపించకుండా హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఈ కట్ అవుట్ డ్రెస్ లో ప్రియాంక కత్తిలా ఉంది. సింపుల్ మేకప్ లో స్టన్నింగ్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.