Pregnant Women: గర్భం దాల్చిన ప్రతి ఒక్క మహిళ తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తమ ఆరోగ్యం బాగుంటేనే కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఎదుగుదల తన ఆరోగ్యం కూడా బాగుంటుందని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆయనప్పటికీ కొంతమంది మాత్రం ప్రెగ్నెన్సీ సమయంలో వామిటింగ్ సెన్సేషన్ కారణంగా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.
ఈ విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆహార పదార్థాలను సరిగా తీసుకోకపోతే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మహిళలు తప్పనిసరిగా ఈ పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గర్భిణీ స్త్రీలు బాగా పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి గుడ్లు మాంసం చేపలు వంటి పదార్థాలను అధికంగా తీసుకోవాలి. అలాగే ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూరలు కూరగాయలను పండ్లను తీసుకుంటూ ఉండాలి.
Pregnant Women:
ఇక నెలలు పెరిగే కొద్దీ మహిళలలో గ్యాస్టిక్ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది తద్వారా భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొంతసేపు నడవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఏడవ నెల నుంచి ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డ పై ఎలాంటి ఒత్తిడి లేకుండా మంచిగా ఎదుగుదల ఉంటుంది. కాళ్లు వాపు సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళు తరచూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం ఎంతో ముఖ్యం అలాగే గుప్పెడు వేరుసెనగ విత్తనాలను తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది తద్వారా కాళ్లు వాపులు కూడా తగ్గుతాయి. ఇక ప్రతిరోజు పగలు రెండు గంటల విశ్రాంతి ఎంతో అవసరం.