Pregant Ladies: అమ్మతనాన్ని ఆస్వాదించడానికి ప్రతి ఒక్క మహిళ ఎంతో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు గర్భం దాల్చారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు వారి ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారం మొదలుకొని వారు నడవడిక వారు వేసుకునే దుస్తులు కూడా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డపై ప్రభావాన్ని చూపుతాయి కనుక అన్ని విషయాలలోనూ గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారు తీసుకునే ఆహార విషయంలో ఒకటికి రెండుసార్లు వైద్యులను పెద్దవారిని అడిగి తెలుసుకుని మరి తినాల్సి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహార పదార్థాలను దూరంగా పెట్టడం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాలను తినటం వల్ల బిడ్డ ఎదుగుదల ఎంతో చక్కగా ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మొక్కజొన్నలను తినడం వల్ల కడుపునొప్పి వచ్చే సమస్య ఉంటుందని పలువురు భావిస్తూ మొక్కజొన్నను తినడానికి ఇష్టపడరు కానీ గర్భం దాల్చినటువంటి మహిళలు మొక్కజొన్న తినటం వల్ల బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Pregant Ladies
మొక్కజొన్నలలో ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్స్ ఫైబర్ వంటి పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడటమే కాకుండా బిడ్డ ఎదుగుదలకు కూడా ఎంతో దోహదపడతాయి ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు మొక్కజొన్నలు తినడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మలబద్ధక సమస్యను తొలగించి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పోషక విలువల కారణంగా పిల్లలు ఎలాంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. అందుకే ప్రెగ్నెన్సీ మహిళలు తప్పనిసరిగా వారి ఆహార పదార్థాలలో మొక్కజొన్న తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.