Tue. Jan 20th, 2026

    Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ గురించి ఓ విషయంలో ఎప్పటికీ ఆసక్తి తగ్గదు.. అది ఆయన పెళ్లి! సినిమాల్లో భారీ విజయం సాధిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, 45 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ బ్యాచిలర్ గానే కొనసాగుతుండటం అభిమానుల్లో కలవరం పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లిపై ఊహాగానాలు, రూమర్లు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా మళ్లీ ఈ పెళ్లి చర్చల్ని మళ్లీ ఉత్కంఠతో నింపుతోంది ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి ఆలయంలో చేసిన ప్రత్యేక పూజలు.

    ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ తలుపులమ్మలోవ ఆలయంలో ఆషాఢ మాసం జాతర సందర్భంగా శ్యామల దేవి అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, ఆలయ విశిష్టతను వివరించారు. పెద్దమ్మ పూజల నేపథ్యంలో ప్రభాస్ పెళ్లికి ఇది సంకేతమా? అని టాలీవుడ్ జనాలు, అభిమానులు, సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు మొదలయ్యాయి.

    prabhas-special-pujas-for-marriage
    prabhas-special-pujas-for-marriage

    Prabhas: పెళ్లిపై శ్యామల దేవి స్పందించారు..

    ఇంతకు ముందు కూడా ప్రభాస్ పెళ్లిపై పలు సందర్భాల్లో శ్యామల దేవి స్పందించారు. “పెళ్లి అనేది ఓ శుభ గడియ, అది రాగానే జరగక తప్పదు. దేవుడు రాసినంతవరకే జరుగుతుంది. టైమ్ వచ్చినప్పుడు మీరంతా హ్యాపీగా ఫీలవుతారు” అంటూ ఆమె చెప్పిన మాటలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే “మాది పెద్ద కుటుంబం, అందరితో కలిసిపోయే అమ్మాయిని ప్రభాస్ ఇష్టపడతాడు. నెగటివ్ టాక్ చేసే వాళ్లు ఆయనకు నచ్చరు” అని ఆమె తాజాగా వ్యాఖ్యానించారు.

    ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. వెనుకేసి భారీ బడ్జెట్ ప్రాజెక్టులు వరుసగా లైన్లో ఉండడంతో పెళ్లికి సమయం దొరుకుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ పెద్దమ్మ చేసిన పూజలు అభిమానుల్లో ఆశలు నింపాయి. గతంలో ఎన్నిసార్లైనా పెళ్లి గురించి వార్తలు వచ్చినా చివరికి అవి రూమర్లగానే మిగిలిపోయాయి. ఈసారి మాత్రం వాస్తవంగా ఏదైనా సంకేతమా అన్న ఆసక్తికర వాతావరణం నెలకొంది. అయితే నిజంగా ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకుంటారా? ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తీరుతాయా? అన్నది చూడాలి!

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.