Prabhas: పాన్ ఇండియన్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. అయితే, దానికి తగ్గట్టుగా మాత్రం సక్సెస్ లు దక్కడం లేదు. దీనంతటికీ కారణం ప్రభాస్, రాజమౌళినే. ‘బాహుబలి’ సిరీస్ కి ముందు ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కనీసం యావరేజ్ గా అయినా నిలిచేది. కానీ, రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ కి అసాధారణమైన పాపులారిటీని ప్రభాస్ కి తెచ్చిపెట్టాడు.
ఆ తర్వాత ఏ సినిమా చేసిన దర్శకుడు రాజమౌళి మార్క్ ని అందుకోలేకపోతున్నాడు. ప్రభాస్ మీద సహజంగానే అంచనాలు భారీగా ఉంటున్నాయి. అవి ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా పెరుగుతూనే ఉన్నాయి గానీ, తగ్గడం లేదు. ప్రభాస్ కి ఉన్న హైప్ మీద దృష్ఠి పెడుతున్నారు గానీ, కథ..కథనాల మీద మాత్రం దృష్టిపెట్టడం లేదు. దానివల్ల సినిమాలు ఆశించిన సక్సెస్ సాధించలేకపోతున్నాయి.
Prabhas: అదే ప్రభాస్ కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.
మొదటి రోజు ప్రభాస్ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్ళు నమోదవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ప్రపంచ దేశాలలో అభిమానులు ఏర్పడటం ప్రభాస్ కే దక్కిన గొప్పతనం. అదే ప్రభాస్ కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ‘బాహుబలి’ రేంజ్ కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కానీ, ఆ రేంజ్ అంచుల వరకూ కూడా ఇప్పటి వరకూ వచ్చిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ సినిమాలు వెళ్ళలేదు.
కాబట్టే, ప్రభాస్ సినిమాలు ఫేయిల్ అవుతున్నాయి. అంచనాలు పక్కన పెట్టి గనక ప్రభాస్ సినిమాలు చూస్తే బాగానే ఉంటుంది. కానీ, అది జరగడం లేదు. దానివల్ల ప్రభాస్ కి డ్యామేజ్ జరుగుతుంది. తాజాగా విడుదలైన ‘సలార్’ ట్రైలర్ మాత్రం కాస్త ‘బాహుబలి’ అంచనాలను రీచ్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ట్రైలర్ వల్ల అంచనాలు బాగా పెరిగాయి. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. ఏదేమైనా ‘బాహుబలి’, ‘రాజమౌళి’ ప్రభాస్ పాలిట శాపంగా మారారు.