Shani Dev: మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనీశ్వరుడిని కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము అయితే చాలామంది శని దేవుడిని పూజించడానికి భయపడుతూ ఉంటారు కానీ శని దేవుడు కూడా మనకు ఎన్నో మంచి ఫలితాలను కలిగిస్తారు. కానీ ఆయన ధర్మం ప్రకారం మనం చేసినటువంటి కర్మలకు తగిన ప్రతిఫలం అందిస్తారు కనుక చాలామంది శనీశ్వరుడిని పూజించాలి అంటే భయపడుతూ ఉంటారు. ఇకపోతే శని ప్రభావ దోషం కనుక మనపై ఉంటే ఈ శని దోషం నుంచి బయటపడటం కోసం చాలామంది ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు.
ఇలా శని ప్రభావ దోషం నుంచి బయటపడటానికి చేసే పరిహారాలలో శనీశ్వరుడికి నల్లటి నువ్వులతో పూజించడం అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వంటిది కూడా ఒకటి. శని ప్రభావం కనుక మనపై ఉంది అంటే మనం చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కూడా కుదరవు ఇలాంటి సమస్యలు ఉన్నవారు నువ్వులతో శనీశ్వరుడిని ఇలా పూజిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు మనకి కనిపిస్తాయి అయితే ప్రతి శనివారం శనీశ్వరుడి విగ్రహం ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. అలాగే శనీశ్వరుడుకి బెల్లం అంటే ఇష్టం అందువల్ల బెల్లంను నైవేద్యం పెడితే శనీశ్వరుని ప్రభావము తగ్గుతుంది.అలాగే నల్లటి గుడ్డలో నల్లని నువ్వులను మూట కట్టి ప్రమిదలో వేసి వత్తులను వెలిగించిన శని ప్రభావ దోషం తొలగిపోతుంది.అంతేకాక నవ గ్రహాల చుట్టు 9 ప్రదిక్షణాలు చేసి కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయం లేదా ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ప్రతి శనివారం ఇలా చేయటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.