Polala Amavasya: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణమిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే కొన్ని అమావాస్యలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది అలాంటి అమావాస్యలలో పోలాల అమావాస్య ఒకటి. ఈ పొలాల అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీ జరుపుకోబోతున్నారు. ఈ పోలాల అమావాస్య రోజు తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేయటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఇక పోలాల అమావాస్య పూజా సమయం అలాగే సరైన తిథి ఏంటి అనే విషయానికి వస్తే..హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 5:21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3న ఉదయం 7:24 గంటలకు ముగుస్తుంది. కనుక పోలాల అమావాస్యను సోమవారం, 2 సెప్టెంబర్ 2024న జరుపుకుంటారు. పోలాల అమావాస్య ఉదయం 4.38 గంటల నుంచి 5.24 గంటల వరకు బ్రహ్మ ముహూర్త సమయం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6.09 నుండి 7.44 గంటల వరకు పూజలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ఈ రోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఉంది. జీవితం సుఖసంతోషాలతో కొనసాగడానికి, పిల్లలు సౌఖ్యం కోసం మహిళలు పోలాల అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు. ఇక అమావాస్య రోజు ఉదయం నిద్ర లేచి తులసి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇక తులసి చెట్టుకు గంగాజలంతో శుభ్రం చేసి ప్రత్యేక పువ్వులతో అలంకరించాలి అలాగే నెయ్యితో దీపారాధన చేసి తులసి కోట చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ‘ లేదా ‘ఓం తులసీ మాతా నమః’ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వల్ల ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవని అన్ని శుభాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.