Pine apple: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో టీ కాఫీలకు బదులు ఉదయం లేవగానే గ్రీన్ టీ తాగటానికి ఆసక్తి చూపుతున్నారు. గ్రీన్ టీ తాగటం వల్ల శరీర బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకుంటున్నారు. అయితే గ్రీన్ టీ కంటే పైనాపిల్ గ్రీన్ టీ తో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పైనాపిల్ గ్రీన్ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి..? పైనాపిల్ గ్రీన్ టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పైనాపిల్ గ్రీన్ టీ తయారు చేసుకోవడానికి ముందుగా అరకప్పు పైనాపిల్ ముక్కలను తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నీరు బాగా మరిగిన తర్వాత పైనాపిల్ ముక్కలు, అల్లం,అంగుళం దాల్చిన చెక్క, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత టీ వడపోసి స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా తయారుచేసిన పైనాపిల్ గ్రీన్ టీ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ పైనాపిల్ గ్రీన్ టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీ తాగుతూ వ్యాయామాలు చేయడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఈ పైనాపిల్ గ్రీన్ టీ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు కూడా దూరం అవుతాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గటమే కాకుండా జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. అలాగే గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే పైనాపిల్ గ్రీన్ టీ తాగటం అలవాటు చేసుకోవాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.