Health Tips: సాధారణంగా మనం కదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల కొన్ని సార్లు మన కాళ్లు తిమ్మిర్లు కలుగుతుంటాయి ఇలా తిమ్మిర్లు వచ్చినప్పుడు కొంతసేపు లేచి అటు ఇటు నడవడం వల్ల తిరిగి యధా స్థానానికి వస్తాము అయితే చాలా మందిలో ఎక్కువగా అరికాలు చేతులు తిమ్మిర్లు కలుగుతూ ఉంటాయి. అరికాలు అరిచేతులలో తిమ్మిర్లు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అయితే తరచూ ఇలాంటి సమస్యతోనే మీరు బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా అరికాళ్ళు అరిచేతులలో తిమ్మిర్లు రావడానికి కారణం లేకపోలేదు. మరి ఎలాంటి సమస్యల కారణంగా ఇలా అరిచేతులు అరికాళ్లలో తిమ్మిర్లు వస్తాయి అనే విషయానికి వస్తే… మన రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉన్నప్పుడు అరికాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి. రక్తంలో ఎక్కువగా ఉండే చక్కెరలు నరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అలాగే వెన్నెముకలో జారిన డిస్క్ కాళ్ల నరాలపై ఒత్తిడి చేయడం వల్ల కూడా తిమ్మిర్లు ఎక్కువగా వస్తాయి.
ఇక చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, ల్యూపస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో కూడా తిమ్మిర్లు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా శరీరంలో విటమిన్ బి, విటమిన్ ఇ లు లోపించడం వల్ల ఈ విధమైనటువంటి తిమ్మిర్లు కలుగుతూ ఉంటాయని ఇలాంటి సమస్యలతో బాధపడేవారు శరీరంలో నరాలు కుచించకపోవడం వల్ల రక్త సరఫరా కూడా సరిగా అందకపోవడంతో ఇలా అరికాళ్ళు అరిచేతులలో తిమ్మిర్లు ఉంటాయని చెప్పాలి.అయితే ఇలా తరచూ ఈ సమస్యతో బాధపడుతూ కనుక ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో మంచిది.