Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీలో రాజకీయ ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ రాజకీయాలలోకి అడుగుపెట్టి దశాబ్దం అవుతున్న ఇప్పటికి తనని తాను బలమైన నాయకుడుగా రిప్రజెంట్ చేసుకోవడం విఫలం అవుతున్నాడు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అనే విమర్శలు అధికార పార్టీ పదే పదే చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికలలో మాత్రం కచ్చితంగా అధికారంలోకి రావాలని మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నం అధికార వైసీపీ చేస్తూనే ఉంది. తాజాగా అన్ స్టాపబుల్ లో తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2004 ఎన్నికల సమయంలో తాను పార్టీ పెట్టి నేరుగా పోటీ చేయకపోవడానికి కారణం ఉందని పేర్కొన్నారు. అందుకే కేవలం పోటీ చేయకుండా సపోర్ట్ గా మాత్రమే నిలబడ్డాను అని తెలిపారు. అలాగే రాజకీయ ప్రయాణం అంటే సుదీర్ఘ ప్రయాణం అవసరం అని, ముందుగా రాజకీయాలని అర్ధం చేసుకోవాలని, తరువాత మన భావజాలం ప్రజలకి చేరువ చేయాలని అన్నారు. దీనికి కనీసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ సంక్షేమమే ధ్యేయంగా పార్టీ పెట్టారు. మంచి చేయాలని అనుకున్నప్పుడు మరి టీడీపీలో చేరొచ్చు కదా అని బాలకృష్ణ అడిగారు.
అయితే తాను భావజాలం కేవలం ఉద్యోగాల కల్పన కాదని, యువతలో అందరూ కూడా ఎందుకు పారిశ్రామిక వేత్తలుగా మారకూడదు అనే ఉద్దేశ్యం తనదని చెప్పారు. ఎంతో తెలివి ఉండి విదేశాలకి వెళ్ళిపోతున్నారు. అలాంటి శక్తి మేధస్సు ఇక్కడే ఉపయోగపడాలి అనేది తన ఆలోచన అని, అయితే ప్రస్తుత రాజకీయ పార్టీలు నిర్దిష్టమైన అభిప్రాయాలతో ఉన్నాయని, నా ఆలోచనలు వేరొక పార్టీలో ఉంటే రీచ్ కావని ఉద్దేశ్యంతో సొంతగా పార్టీని పెట్టడం జరిగిందని తెలిపారు. ఇలా ప్రజలలోకి వెళ్ళే, వారికి మంచి చేయాలని చేస్తున్న ప్రయత్నంలో అధికారం వస్తే ఒకే, రాకపోయిన సమస్య లేదు కష్టపడతా, నా భావజాలం ప్రజలకి చేరువ అయ్యే వరకు తన ప్రయాణం కొనసాగిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.