Pawan Kalyan – Sai Dharam Tej : మెగా మల్టీస్టారర్ ప్రారంభం..

Pawan Kalyan – Sai Dharam Tej : ఘనంగా మెగా మల్టీస్టారర్ ప్రారంభం అయింది. తమిళంలో నటుడు, దర్శకుడు సముద్రఖని రూపొందించిన సూపర్ హిట్ మూవీ వినోదాయ చిత్తం. ఓటీటీలో విడుదలై అద్బుతమైన విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం తెలుగు రీమేక్ పనులు మొదలుపెట్టారు. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు లేవని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై రక రకాల రూమర్స్ వచ్చాయి.

pawan-kalyan-sai-dharam-tej-mega maltistarar started

ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఆయన మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఈ కొత్త చిత్రాన్ని పవన్ నేడు పట్టాలెక్కించారు. తమిళ వెర్షన్‌ను రూపొందించిన సముద్రఖని తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎప్పటినుంచో మెగా మల్టీస్టారర్ కోసం మెగా అభిమానులే కాదు, అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందరి కోరిక ఇప్పుడు నెరవెవరబోతోంది.

Pawan Kalyan – Sai Dharam Tej : మామా అల్లుళ్ళు చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహకందడం లేదు.

ఇక తాజాగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్‌లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. చిత్రీకరణలో పాల్గొన్న పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ మీద మామా అల్లుళ్ళు చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహకందడం లేదు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

pawan-kalyan-sai-dharam-tej-mega maltistarar started
pawan-kalyan-sai-dharam-tej-mega maltistarar started

మరో వైపు సాయి ధరమ్ తేజ్ కూడా సెలెక్టెడ్‌గా చిత్రాలను చేస్తూ తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూన్నాడు. మరి ఈ మెగా మల్టీస్టారర్‌తో మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను నమోదు చేస్తారో చూడాలి. కాగా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన హాట్ బ్యూటీ కేతికా శర్మ నటిస్తోంది.

pawan-kalyan-sai-dharam-tej-mega maltistarar started
pawan-kalyan-sai-dharam-tej-mega maltistarar started
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.