Categories: LatestNewsPolitics

Pawan Kalyan: బీఆర్ఎస్ తో పొత్తుకి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారా?

Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో వచ్చే ఎన్నికల లక్ష్యంగా చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలం రాజకీయ ప్రయాణంలో ఇప్పటివరకు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న నాయకుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీలతో విభేదించి ఒంటరిగా పోటీ చేశారు. ఆ సమయంలో బిఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరై వారితో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బంధంలోనే కొనసాగుతున్నారు. 

2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వైసీపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు  సిద్ధంగా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీ రాజకీయాలలో తమ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ కాస్త అగ్రిసివ్ మోడ్ లో ఏపీలో వెళ్తుంది. కొద్దిరోజుల క్రితం మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీకి కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు హరీష్ రావుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ అంశంపై వీడియో రిలీజ్ చేసి వైసీపీ మంత్రులు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారు అంటూ విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రజలకు బేషారతుగా వైసీపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఈ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారంటూ విమర్శించడం విశేషం. కొత్త పొత్తులకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెరతీస్తున్నారని అందుకే బీఆర్ఎస్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు.

గతంలో తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇదే రకమైన ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 1000 కోట్ల ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి ఆశ చూపించింది అంటూ ఒక న్యూస్ ప్రచారం చేసింది. దానిపై జనసైనికులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు హరీష్ రావు కూడా తెలంగాణ ప్రజలను అవమానించారని వైసీపీ పై వ్యాఖ్యలు చేయలేదు.  కానీ పవన్ కళ్యాణ్ వైసిపి మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కొత్త పల్లవి అందుకోవడం ఆసక్తికరంగా మారింది.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.