Tue. Jan 20th, 2026

    Pawan Kalyan:  పవర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలలో కూడా చురుకుగా వెళ్తున్నారు. రానున్న ఎన్నికలలో ఏపీలో బలమైన ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ప్రస్తుతం ఉన్నారు. గత పది రోజుల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే మే మొదటి వారంలో సుజిత్ ఓజీ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా కోసం 45 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్.

    Pawan Kalyan's OG - They Are Just Rumours

    దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు మూవీ షూటింగ్ కూడా ఆగష్టు లోపు ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత వారాహితో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పర్యటన చేయనున్నారు. ఎన్నికలకి ముందు బలం పుంజుకొని కచ్చితమైన ప్రభావాన్ని రానున్న ఎన్నికలలో చూపించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయ సర్వేలు కూడా ఈ సారి జనసేన ప్రభావం కచ్చితంగా ఉంటుందనే చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం మరో ఇద్దరు దర్శకులు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

    Pawan Kalyan and Sai Dharam Tej starrer Vinodhaya Sitham, a film by Zee Studios South goes on floors today | PINKVILLA

    వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ 2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ తోనే చేసే ప్లానింగ్ లో ఉన్నారు. అలాగే సుదీర్ వర్మ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ మూవీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ జనసేన అంచనాలు కనుక నిజం అయితే పవన్ కళ్యాణ్ 2024 తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ముఖ్యమంత్రి హోదాలో సినిమాలలో నటిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా వినిపిస్తోంది.