Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ జర్నీ జనసైనికులకి అంత సంతృప్తికరంగా అనిపించడం లేదనే చెప్పాలి. ఏపీలో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బలంగా తన గళం వినిపిస్తే ఎన్నికల నాటికి ప్రజలు ఒంటరిగా అయిన అధికారంలోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయనేది జనసైనికుల మాట. గత నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాలు, భాగానే ప్రజలలోకి వెళ్ళాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల ముందు ప్రజాక్షేత్రంలో తిరగడానికి వారాహి రథాన్ని సిద్ధం చేశారు. అయితే ఈ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రోడ్డు మీద తిరగడం మొదలు పెట్టలేదు. జనసేన ఆవిర్భావ సందర్భంగా వారాహి రథాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు.
అయితే దానిపై ప్రయాణానికి అడుగడుగునా ప్రజల నుంచి కార్యకర్తల నుంచి ఆటంకం వస్తూ ఉండటంతో సగంలోనే ఆపేసి కారులో వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ నెలలో రెండు, మూడు రోజులు పొలిటికల్ ప్రయాణం పెట్టుకొని తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరల సినిమా షూటింగ్ లకి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలని పూర్తి చేయాల్సి ఉంది. ఆ మూడు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి సెప్టెంబర్ అవుతుంది. అప్పటికి ఎన్నికలకి ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఈ ఆరు నెలలు అయిన పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటాడా? మరల సినిమా కొత్త సినిమాలు ఒప్పుకొని షూటింగ్ కి వెళ్లిపోతాడా అనే ప్రశ్న తలెత్తుతుంది.
జనసేన ఆవిర్భావ సభకి వచ్చిన ప్రజా స్పందన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ బలం పెరిగిందని అందరూ అంచనా వేశారు. వచ్చే ఎన్నికలలో కచ్చితమైన ప్రభావం చూపిస్తుందని భావించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకి దొరికిన పొలిటికల్ స్పేస్ వినియోగించుకోకుండా మరణ దానిని టీడీపీకి ఇచ్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి వచ్చిన పొలిటికల్ మైలేజ్ ని కూడా చంద్రబాబు తనకి అనుకూలంగా మార్చుకుంటున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. అయితే ఇవన్ని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ సైలెన్స్ గా ఉంటూ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తూ ఉండటం జనసైనికులకి సైతం మిగుడుపడటం లేదనే మాట వినిపిస్తోంది. పవన్ వ్యూహం ఏంటో, దానిని ఎలా ఆచరణలో పెడతారో అర్ధం కాక జనసేన కార్యకర్తలు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు.