Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో తనదైన పంథాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ బలం తగ్గించే ప్రయత్నంలో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రలకి తెరతీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఓ వైపు టీడీపీ పొత్తు అంటూనే మరో వైపు జనసేనలో వెళ్లాలని అనుకుంటున్నా వారిని టీడీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తమ అనుకూల మీడియా ద్వారా జనసేనపైన విషప్రచారం చేయిస్తున్నారు. బీఆర్ఎస్ తో జనసేన పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అవుతుంది అంటూ. కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ కి ఆఫర్ చేసారు అని ఒక ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు.
అయితే దీనిని జనసేన నాయకులు బలంగా తిప్పికొట్టారు. అయితే ఈ ప్రచారంతో టీడీపీకి ఇబ్బంది అవుతుందని గ్రహించి మరల సరిద్దిద్దుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జనసేన తమతో పొత్తు పెట్టుకోకుంటే భవిష్యత్తు ఉండదు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అయిపొయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇన్ని ప్రచారాల మధ్య పవన్ కళ్యాణ్ కాపు సంఘాలతో జరిగిన సమావేశంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేన కార్యకర్తల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం అస్సలు చేయనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
అలాగే అధికారాన్ని పంచుకోవాల్సిందే అన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో 20 సీట్లు ఇచ్చారు అనే ప్రచారం అంతా అబద్ధం అని, తాను ఏం చేసిన జనసేన కార్యకర్తలు అందరికి చెప్పి చేస్తానని చెప్పారు. అలాగే తమ బలం ఏంటో తెలుసుకొని కచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిందే అనే విధంగా టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు. దీని ద్వారా టీడీపీకి అధికారంలోకి రావడానికి జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వడం ఒక్కటే ముందున్న ఛాన్స్ అని తేల్చేశారు. మొత్తానికి ఒక్క మీటింగ్ లో అటు కాపుపని పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడంతో పాటు టీడీపీ కి కూడా క్లియర్ కట్ గా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.