Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వినిపించే సౌండే వేరు. బాక్సాఫీస్ లెక్కలు వేరు. ఫ్యాన్స్‌లో పూనకాలు అసాధారణం. మిగతా హీరోలందరూ ఓ మైల్ స్టోన్ అని భావించేది పవన్ కళ్యాణ్‌ని ఆయన సినిమా సక్సెస్‌ని. పవన్ బ్లాక్ బస్టర్ సినిమా వసూళ్ళు క్రాస్ చేయాలని తపనపడే హీరోలు మన టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు.
ఆయన పాన్ ఇండియా సినిమా తీయకపోయినా క్రేజ్, రేంజ్ ఆ రేంజ్‌కి ఎప్పుడో చేరుకుంది. కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ని సొంతం చేసుకున్నాయి. అయితే, ఆయన రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలేవి నిర్మాతలకి ఆశించిన లాభాలను తెచ్చిపెట్టలేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన మార్కెట్ స్టామినాకి తగ్గ సినిమాలు చేయకపోవడమే దీనికి ఓ ముఖ్య కారణం అని కూడా చెప్పుకుంటున్నారు.
Pawan Kalyan : వీరమల్లు సినిమా బడ్జెట్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది.
రీ ఎంట్రీ తర్వాత పరిశీలిస్తే ఇది నిజమని కూడా అనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమా ఆల్రెడీ హిందీ తమిళ భాషలలో చూసేయడం, కరోనా తర్వాత రిలీజ్ కావడం, ఏపీలో రిలీజ్ ఇబ్బందులు చూసుకుంటే నిర్మాత దిల్ రాజుకి పెద్ద ఒరిగిందేమీ లేదని చెప్పాలి. ఆ తర్వాత చేసిన భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ వల్ల నిర్మాతలకి నష్టాలే మిగిలాయి.
పవన్ కెరీర్‌లో ఫ్లాప్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు పవన్ మార్కెట్ స్థాయి వేరే లెవల్. కానీ, ఆయన ఎంచుకుంటున్న కథలు ఆ స్థాయిలో ఉండటం లేదంటున్నారు అభిమానులు. హరి హర వీరమల్లు, వినోదాయ చిత్తం, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇప్పటికే వీరమల్లు సినిమా బడ్జెట్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఇది పాన్ ఇండియన్ సినిమా. 5 భాషలలో రిలీజ్ అవుతోంది. క్రిష్ దర్శకత్వం కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా రాబట్టని వసూళ్ళు హరి హర వీరమల్లు రాబట్టి కొత్త రికార్డులు నమోదు చేస్తుందని అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.