Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బలమైన శక్తిగా మారేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బలమైన రాజకీయ వ్యూహాలతో ముందుకి వెళ్తున్నారు. టీడీపీతో పొత్తుల సమీకరణాలకి తెరతీసారు. ఇక బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేనతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల బాణాలు వదులుతున్నారు. ట్వీట్ ల ద్వారా వైసీపీ నాయకులకి మంట పుట్టిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం పాపం పసివాడు అంటూ ఇసుక దోపిడీ గురించి ఒక పోస్టర్ తో ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ అందులో పవన్ కళ్యాణ్ ని దారుణంగా ట్రోల్ చేశారు. క్యాష్ వార్ అనబోయి క్లాస్ వార్ అని జగన్ మాట్లాడుతున్నారు అంటూ పంచ్ లు వేశారు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి క్లాస్ వార్ అనే మాట ఉపయోగిస్తే సామెతలు గుర్తుకొస్తున్నాయి అంటూ విమర్శలు చేశారు. ఇక జనసైనికులు కూడా వీటిని ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా అన్నమయ్య బ్రిడ్జ్ కూలిపోయి వచ్చిన వరదలని గుర్తు చేశారు. అన్నమయ్య బ్రిడ్జ్ ఎప్పుడు కడతారు అంటూ ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని ట్విట్టర్ లో విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే మరో వైపు జగన్ పై చంద్రబాబు కూడా తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. సెంటు భూమి ఇచ్చి ఇళ్ళు కట్టుకోమని వైసీపీ ప్రభుత్వం చెబుతుందని, ఆ సెంటు బూమి చనిపోయిన తర్వాత పాతడానికి సరిపోతుంది అంటూ కామెంట్స్ చేశారు. ఇక టీడీపీ, జనసేన శ్రేణుల విమర్శలు, సోషల్ మీడియాలో మాటల దాడిపై వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉండటం విశేషం. మున్ముందు ఈ విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.