Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న సంగతిత ఎలిసిందే. ఇదిలా ఉంటే జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. అయితే వైసీపీ ఈ బంధం బలపడకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, జనసేన బంధం బలపడితే మాత్రం అది కచ్చితంగా తమకి నష్టం చేస్తుందని వైసీపీ భావిస్తుంది. ఈ నేపధ్యంలో వారిని ఎలా అయిన దూరం పెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా మరో వైపు బీజేపీ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ టీడీపీతో కాలవకూడదు అని భావిస్తున్నారు. అయితే జనసేనాని ఆలోచన మాత్రం వేరుగా ఉంది.
తాజాగా జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో తన భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో తనతో పాటు పోటీ చేసే అందరిని అసెంబ్లీకి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. అలాగే వైసీపీ ఏం జరగకూడదని అనుకుంటుందో, అలాగే జనసేన సైనికులు ఏం జరగాలని ఆశిస్తున్నారో త్వరలో అది జరుగుతుంది అని చెప్పారు. అయితే తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది జనసేన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని జరుగుతుందని చెప్పారు.
అయితే సోషల్ మీడియాలో జరిగే గోబల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అని చెప్పారు. కచ్చితంగా జనసేన అధికారం దిశగా అడుగులు వేస్తుంది అని అన్నారు. అలాగే కచ్చితంగా రానున్న ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో జనసేన బలమైన సంతకం ఉంటుందని చెప్పారు. ఇక పొత్తులపై టీడీపీకి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా సంకేతాలు ఇస్తూనే కచ్చితంగా జనసైనికులు కోరుకునే విధంగా తాను ముఖ్యమంత్రిగా ఉండటం, లేదంటే అధికార భాగస్వామ్యం ఉండాలని పవన్ కళ్యాణ్ కండిషన్ పెట్టినట్లు ఆయన మాటల బట్టి తెలుస్తుంది. మరి దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత వరకు ఒప్పుకుంటాడు అనేది చూడాలి.