Wed. Jan 21st, 2026

    Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వైబ్రేషన్ అని చెప్పాలి. మెగాస్టార్ తమ్ముడు అనే బ్రాండ్ తో సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, బద్రీ, ఖుషి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. యూత్ ఐకాన్ గా మారిపోయి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్  క్రియేట్ చేసుకున్నాడు. ఒక సినిమా సినిమా ఫ్లాప్ అయితే హీరో ఇమేజ్ డౌన్ అయిపోతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ కెరియర్ లో వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ రెట్టింపు అయ్యింది తప్ప తగ్గలేదు. సినిమా సినిమాకి అతని ఫ్యాన్ బేస్ పెరిగిపోతూ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కంటే అతని వ్యక్తిత్వానికి, ఆలోచనలకి ఫాలోవర్స్ ఎక్కువ అయిపోయారు.

     

    అందుకే పవన్ కళ్యాణ్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో 27 ఏళ్ళు పూర్తి చేసుకోగా కేవలం 28 సోనిమలని మాత్రమే పూర్తి చేయగలిగాడు. ప్రస్తుతం అతని చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా నలుగు సినిమాలని పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకి అందిస్తున్నారు. మెగాస్టార్ తమ్ముడుగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ పరంగా ఇప్పుడు చిరంజీవిని సైతం దాటేయడం విశేషం. చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువ ఉంటారని చెప్పారంటే పవన్ బ్రాండ్ వేల్యూ ఏంటో చెప్పొచ్చు.

    AM Rathnam on 'Hari Hara Veera Mallu', 'Satyagrahi' - News - IndiaGlitz.com

    కెరియర్ లో హిట్స్ కంటే ఫ్లాప్ సినిమాలు ఎక్కువ ఉన్నా కూడా అందరి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం. ఇదిలా ఉంటే 27 ఏళ్ళ సినీ ప్రస్థానం ముగించుకున్న పవన్ కళ్యాణ్ మరో వైపు జనసేన పార్టీ పెట్టి 9 ఏళ్ళు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.  ఇక రాజకీయంగా పవన్ కళ్యాణ్ గెలవకపోవచ్చు కాని ప్రజల కోసం ఎక్కువగా పోరాటాలు చేసే నాయకుడు ఎవరంటే ఏపీలో పవన్ కళ్యాణ్ పేరు ఎవరైనా చెప్పాల్సిందే. ఇక 25 ఏళ్ళ రాజకీయ లక్ష్యంతో జనసేనని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ యువతని ఎక్కువగా రాజకీయాలలోకి రావాలని అవినీతి రాజకీయాలకి ముగింపు పలికి కరప్షన్ లేని ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిస్తున్నారు.

     

    దీనిలో కోట్లాది మంది  యువత భాగస్వామ్యం అవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే సినీ, రాజకీయ ప్రస్థానంలో మైలు రాళ్లు దాటిన పవన్ కళ్యాణ్ కి హరిహర వీరమల్లు నిర్మాత, పవన్ కళ్యాణ్ కి అత్యంత ప్రియమైన నిర్మాత ఏఎం రత్నం వీడియో ద్వారా విశేషం చెప్పారు. మ‌న‌సేమో ప్ర‌జ‌ల మీద‌. త‌నువేమో వెండి తెర మీద‌. రెండింటిలోనూ ప్ర‌జ‌ల మ‌న‌సు చూరగొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్రత్యేక అభినందనలు, అతను మరిన్ని ఉన్నత శిఖరాలకి పవన్ కళ్యాణ్ చేరాలని కోరుకుంటున్నట్లు వీడియో పేర్కొన్నారు.