Pavitra Naresh: టాలీవుడ్ లో ప్రేమ పక్షులుగా ఈ మధ్య అందరి దృష్టిని ఆకర్షించిన వారు సీనియర్ నటుడు నరేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. గత కొంత కాలంగా లివింగ్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ. జనవరి 1న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే నరేష్ మూడో రెండో భార్య రమ్యా రఘుపతితో విడాకుల గొడవ ఇంకా తేలలేదు.
దీనిపై ఇప్పటికే ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. అయితే దీనికి నరేష్ వైపు నుంచి కూడా గట్టిగానే సమాధానం ఉంది. పవిత్ర లోకేష్, నరేష్ రిలేషన్ పై గతంలో ట్రోల్స్ చేసిన యుట్యూబ్ చానల్స్, వెబ్ సైట్స్ మీద నరేష్ పోలీసులకి కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్య ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి రమ్య రఘుపతితో తన సంబంధం ఎప్పుడో తెగిపోయింది అని క్లారిటీ ఇచ్చారు.
అయితే బిడ్డ బాగోగుల కోసం మాత్రమే తండ్రిగా నేను ఉన్నానని అన్నారు. అలాగే తరువాత రమ్య రఘుపతి కొంత మంది గ్యాంగ్ తో వచ్చి తన ఇంటిపై దాడి చేసిందని పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నరేష్ ట్విట్టర్ లో పవిత్ర లోకేష్ తో జరిగిన పెళ్లి వీడియో షేర్ చేసి తమకి పెళ్లి అయినట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వీడియో చూస్తూ ఉంటే అదేదో సినిమా కోసం షూట్ చేసిన వీడియో తరహాలో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై నరేష్ కూడా తరువాత మళ్ళీ రియాక్ట్ కాలేదు.
Pavitra Naresh: పవిత్రా లోకేష్, నరేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఓ చానల్ అతనితో మాట్లాడించే ప్రయత్నం చేసిన కూడా త్వరలో ప్రెస్ మీద పెట్టి అన్ని విషయాలు చెబుతానని క్లారిటీ ఇచ్చారు. ఇంటింటి రామాయణం కదా నాది కూడా ముందు దాని గురించి మాట్లాడాలి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా అంటూ తేల్చేశాడు. అయితే ఇప్పుడు పవిత్రా లోకేష్, నరేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి పవిత్ర నరేష్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా షేర్ చేశారు. అయితే ఆయన మాటల బట్టి ఇంటింటి రామాయణం అనే సినిమాలో ఈ పెళ్లి ఎపిసోడ్ ఒక సీన్ అనే మాట వినిపిస్తుంది.