AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ఓ వైపు టీడీపీ, జనసేన ఓ వైపు అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. అలాగే ఈ కూటమితోనే బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ నాయకులని ఒప్పిస్తానని అంటున్నారు. తన దగ్గర కచ్చితమైన లెక్కలు బీజేపీని ఒప్పించేందుకు ఉన్నాయని చెబుతున్నారు. ఇక జనసేనని ఒంటరి పోరు వైపు మళ్లిస్తే సునాయాసంగా గెలవచ్చు అని వైసీపీ వ్యూహాలు వేసుకుంది. ఆ దిశగానే తన క్యాడర్ తో పొత్తుల బంధంపై దుష్ప్రచారం చేయడం ద్వారా జనసైనికుల నుంచి వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. అయితే ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చేశారు. పొత్తులతో వచ్చే ఎన్నికలలో వెళ్తామని చెప్పేశారు.
అయితే తమ గౌరవానికి భంగం కలగకుండా సీట్లు విషయంలో డిమాండ్ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. తమకి పర్టిక్యులర్ గా కొన్ని ప్రాంతాలలో బలం ఉందని, అక్కడ ఓటు శాతం ఎక్కువ ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే జనసేనాని లెక్క ప్రకారం 30 నుంచి 40 స్థానాలలో కచ్చితంగా గెలిచే సత్తా ఉందని క్లారిటీ ఇచ్చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని వైసీపీ నేతలు చాలెంజ్ చేసిన కూడా కచ్చితంగా తాను పోటీ చేయబోయేది ఎన్ని స్థానాలు అనేది కూడా చెప్పేశారు. ఇక టీడీపీతో వై నాట్ 175 అంటూ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో పొత్తుల ద్వారానే ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధం అవుతోంది.
దీని ద్వారా నిజానికి రాయలసీమ జిల్లాలలో టీడీపీకి కూడా గట్టి పట్టు లేదని చెప్పాలి. పొత్తుల నేపథ్యంలో వైసీపీని వ్యతిరేకించే వారు టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది. మామూలుగా చూసుకుంటే టీడీపీ లెక్క 120 నుంచి 140 స్థానాల వరకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బలం ఉంది. వైసీపీ అయితే 175 నియోజకవర్గాలలో గెలవాలని వ్యూహాలు వేసుకుంటుంది. అయితే ఇప్పుడు జనసేనాని టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే కనీసం 120 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉండేది.
అయితే ఈ పొత్తుతో వారి బలం గణనీయంగా తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 80 నుంచి 100 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. అయితే కూడా ప్రభుత్వానికి సానుకూలత ఉంటే మాత్రమే. ఇక బీజేపీ టీడీపీ, జనసేన కలిస్తే ఓ ఐదు నుంచి 6 స్థానాలలో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2024లో ఏపీ రాజకీయ ముఖచిత్రం కచ్చితంగా మారుతుందని అందరూ భావిస్తున్నారు. గతంలో ఏదో ఒక పార్టీ లీడింగ్ లోకి రావడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.