Categories: Health

Health: ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే

Health: ఆధునిక యుగంలో ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానాలలో చాల మార్పులు వచ్చాయి. ప్రజల అవసారాలని దృష్టిలో ఉంచుకొని వ్యాపారవేత్తలు నిల్వ ఉన్న ఆహారాలని ప్యాకేజ్ చేస్తూ అందిస్తున్నారు. పల్లెటూళ్ళలో స్వచ్చమైన ఆహారం అప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. అయితే సిటీ కల్చర్ పెరిగిపోవడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు బ్రతుకు తెరువు కోసం సిటీకి వలసలు పోతున్నారు. దీంతో సిటీలో ఉండే ప్రజల అవసారాలకి సరిపడా ఆహార పదార్ధాలు మామూలుగా దొరకడం లేదు. దీంతో ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీలు ప్రజల అవసరాలని, వారి ఆహారపు అలవాట్లని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ ఆహారాన్ని ప్యాకింగ్ చేసి వాటిని అవి నిల్వ ఉండటానికి కొన్ని రకాల రసాయినాలని ఉపయోగిస్తూ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.

అయితే వీటిని డైట్ అండ్ ప్రోటీన్ ఫుడ్ గా ప్రచారం చేస్తున్నారు. అలాగే హెల్డీ ఫుడ్ అంటూ ప్రమోషన్ చేస్తున్నారు. చివరికి సహజసిద్ధంగా లభించి కొబ్బరి నీళ్ళు కూడా ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచి అమ్మేస్తున్నారు. అలాగే టీ పొడి నుంచి చికెన్ వరకు అన్నింటిని కూడా ప్యాకేజ్ ఫుడ్ గా మార్చేసి సూపర్ మార్కెట్ లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని ఉపయోగించవచ్చు అనే ఉద్దేశ్యంతో ప్రజలు కూడా ఈ ప్యాకేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఫుడ్స్ ప్రొడక్ట్స్ చాలా ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

packaged-food-creates-huge-damage-to-body

ప్యాకేజ్ చేసి నిల్వ ఉంచి ఆహార పదార్ధాలని తరుచుగా తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి అండాశయ, బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మన రోజువారి ఆహారంలో 10 శాతం అల్ట్రా ప్యాకెజ్డ్ ఫుడ్ వాడడం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 2% పెరుగుతుందని పేర్కొంటున్నారు. అదే అండాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 19% ఉంటుందని చెబుతున్నారు.

ప్యాకేజ్ ఫుడ్ తీసుకోవడం వలన క్యాన్సర్ మాత్రమె కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.  టైప్ -2 డయాబెటిస్ కూడా ప్యాకేజ్ ఫుడ్ కారణంగా వస్తుందని తెలుస్తుంది. పిల్లల్లో అధిక బరువు సమస్య వస్తుందని చెబుతున్నారు. ప్యాకేజ్ ఫుడ్ వినియోగం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Varalakshmi

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.