Health: ఈ మధ్యకాలంలో ప్రజల దైనందిన జీవితాలలో ప్రోటీని కంటెంట్ ఉన్న ఆహార పదార్ధాలు బాగా తగ్గిపోతున్నాయి. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. రోజువారీ లైఫ్ లో టేస్టీకి బాగా అలవాటు పడ్డ ప్రజలు ఈ ఇన్ స్టెంట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒకానొక సమయానికి ఈ జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోతున్నారు. ప్రోటీన్, విటమిన్స్ కంటెంట్ ఉండే ఫుడ్స్ ని బాగా తగ్గించేస్తున్నారు. అలాగే ఒకప్పటి సంప్రదాయ ఆహార పదార్ధాలలో ఈ ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాటి వినియోగం క్రమంగా తగ్గిపోతుంది. ఇక ఆ సంప్రదాయ ఆహార పదార్ధాలలో కూడా రకరకాల కెమికల్స్ వేసి నిల్వ ఉంచడం వలన వాటిలో కూడా విటమిన్స్ కంటెంట్ తగ్గిపోతుంది.
ఈ విటమిన్స్ శరీరంలో తగ్గిపోవడం వలన చిన్న వయస్సులోనే చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. హాస్పిటల్స్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక హాస్పిటల్స్ లో విటమిన్స్ కోసం ప్రత్యేకంగా మెడికల్ సప్లిమెంట్స్ ని డాక్టర్లు రిఫర్ చేస్తున్నారు. అయితే విటమిన్స్ కోసం తీసుకునే మెడికల్ సప్లిమెంట్స్ కారణంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీకి చెందిన పరిశోధకులు కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ పై ప్రయోగాలు చేశారు. వీటిలో బి3 విటమిన్ సప్లిమెంట్స్ కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. బి3 విటమిన్ సప్లిమెంట్స్ లో ఉండే నికోటినమైడ్ రిబోసైడ్ క్యాన్సర్ కారకాలని ప్రేరేపించి వ్యాధి తీవ్రతని పెంచుతుందని గుర్తించారు.
శరీరంలో కణజాల వృద్ధి కోసం ఈ బి3 విటమిన్ సప్లిమెంట్స్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది సాధారణ కణజాలాన్ని అందితే బాగానే పని చేస్తుందని చెప్పారు. అయితే ప్రతి మనిషిలో క్యాన్సర్ కణాలు ఉంటాయని, వాటికి గాని ఈ బి3 విటమిన్స్ అందితే మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్యాన్సర్ కణాలని వృద్ధి చేసి వ్యాధి తీవ్రతని పెంచుతుందని, అలాగే ఇంకా చాలా రకాల అనారోగ్యలకి ఈ సప్లిమెంట్స్ కారణం అవుతాయని చెప్పారు. మహిళలు గర్భంతో ఉన్న విటమిన్ సప్లిమెంట్స్ ని ఇస్తూ ఉంటారు. ఈ సప్లిమెంట్స్ ని మోతాదుకి మించి వాడితే మాత్రం ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మిగిలిన విటమిన్స్ సప్లిమెంట్స్ పైన కూడా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.