Oscar Gift Bag : ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆస్కార్ అవార్డుల గురించి అవార్డులు గెలుపొందిన వారి గురించే హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం లిఖించబడిన అరుదైన సందర్భం ఇది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అందులోని నాటు నాటు పాటకి ఆస్కారం దక్కడం మన తెలుగు పరిశ్రమకి, తెలుగు జాతికి గర్వకారణం.
అయితే, దీనితో పాటు ఇప్పుడు మరో హాట్ టాపిక్ ఆస్కార్ బ్యాగులో ఏముంటాయి అని. ఆస్కార్ గిప్ట్ బ్యాగ్ గురించి ప్రస్తుతం మన ఇండియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ప్రతీ సంవత్సరం ఓ ఆనవాయితీగా ఇస్తూ వస్తున్నదే అయినప్పటికీ మొట్టమొదటిసారి ఒక ఇండియన్ మూవుఈకి..మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు’ పాటకు అవార్డు రావడంతో ఈ గిప్ట్ బ్యాగ్ కూడా ఎంతో ప్రత్యేకను సంతరించుకుంది. గత కొన్ని గంటల నున్చి ఈ గిప్ట్ ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ బ్యాగులో ఏమున్నాయి? వీటి ప్రత్యేకత ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో పాటు అందరూ మాట్లాడుకుంటున్నారు.
Oscar Gift Bag : 2002 నుంచి డిస్టింక్టివ్ అసెట్స్ అనే కంపెనీ ఈ గిప్ట్ బ్యాగ్ లను అందిస్తుంది.
ప్రతీ ఏడాది ఆస్కార్ అవార్డుతో సంబంధం లేకుండా నామినీ అయిన కొందరిని ప్రత్యేకంగా ఈ గిప్ట్ బ్యాక్ కోసం ఎంపిక చేస్తుంటారు. అవార్డు గెలిచినా, గెలవకపోయినా ఈ గిప్ట్ బ్యాగ్ తో గౌరవించడం గత కొన్నేళ్ళుగా వస్తున్న అకాడమీ ఆనావాయితీ. అదే విధంగా 2023లోనూ ఇలా 26 మంది నామినీలకు ఈసార్రి కూడా ఖరీదైన గిఫ్ట్ బ్యాగులను అందించారు. ఈసారి యాక్టింగ్, డైరెక్టింగ్ నామినీలకు ఈ ఖరీదైన గిఫ్ట్ బ్యాగులు చేరాయి. ఈ గిఫ్ట్ బ్యాగ్ లో మొత్తం 1.26 లక్షల డాలర్లు (అంటే సుమారు రూ.1.03 కోట్లు) విలువైన బహుమతులు ఉండటం ఆసక్తికరమైన విషయం.
ఈ’స్వాగ్ బ్యాగ్ ‘లో ఇటలీ ట్రిప్.. ఆస్ట్రేలియాలో ఒక ప్లాట్ వంటి మొత్తం 60 రకాల ఐటెమ్స్ ఉన్నాయి. $20000 ఖరీదుగల సౌందర్య ఉత్పత్తులు, $9000 ఇటాలియన్ ఎస్కేప్- డిజైనర్ కాస్ట్యూంస్ అలాగే నగలు వంటివి ఇంకెన్నో ఉన్నాయి. ఇక ఈ బ్యాగులను యుఎస్లో నివసిస్తుంటే నేరుగా వారి ఇంటికి డెలివరీ చేస్తారు. ఒకవేళ నామినీలు సిటీలల్లో సందర్శిస్తున్నట్లయితే వారు ఉంటున్న హోటళ్లకే పంపుతారు.
బ్యాగ్‌లో దాదాపు $5000 విలువైన రియలిస్టిక్ ప్రాడెక్ట్స్ కూడా ఉన్నాయి. మిగిలినవన్ని ఇన్విటేషన్స్, గిప్ట్ ఓచర్స్ వంటివి ఉన్నాయి. ఒకవేళ గనక నమినీలు ఈ ఆఫర్లు వాడుకోకపోయినట్లైతే వాటి విలువ ఎంత ఉంటుందో చూసి డబ్బు రూపంలో చెల్లిస్తారు. కెనడా రిసార్ట్స్ సందర్శనకి $40000 నుంచి $12000 విలువైన లైపోసక్షన్ బోటాక్స్, సౌందర్య చికిత్సలకి సంబంధించి $20000 ధర చేసేవి ఈ బ్యాగులో ఉన్నాయి. వాటిలో ఏవి ఉపయోగించకపోయినా పన్ను నుంచి మినహాయింపు ఇస్తారు.
$435 ధర కలిగిన దుబాయ్ ఆర్గానిక్ ఖర్జూరాల బాక్స్, $7000 విలువైన బామెన్ మెడికల్ ప్రాడెక్ట్స్ ఉన్న ఎల్ఎల్ బీన్ టోట్ బ్యాగ్ ఉంది. అలాగే, లైఫ్స్టైల్ విలువ దాదాపు $40000 వరకూ ఉంటుంది. ఈ ఫీచర్ కెనడాలోని గ్రామీణ ఒట్టావాలోని 10 ఎకరాల ఎస్టేట్లో మూడు రాత్రులు గడపడానికి అనుమతి ఉంటున్ది. ఇటలీలోని ఇస్చియాలోని లైట్హౌస్లో 7 మంది స్నేహితులలో గ్రాండ్ వెకేషన్ ఎంజాయ్ చేయవచ్చు.
ఇక $396 డాలర్ల విలువ కలిగిన పర్ఫ్యూంస్, ఫ్రోంటెరా వైన్స్ కి $20, పాప్ కార్న్ కి $45 డాలర్ట వరకూ ఉంటుంది. ఇందులో జపనీస్ మిల్క్ బ్రెడ్ వంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఈ ఖరీదైన వెల్నెస్ గిఫ్ట్ లను 2002 నుంచి డిస్టింక్టివ్ అసెట్స్ అనే కంపెనీ ఈ గిప్ట్ బ్యాగ్ లను అందిస్తుంది.