Oscar 2023 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులను అందుకొని సత్తా చాటిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ నుంచి రాజమౌళి మీద ఎనలేని అంచనాలు పెరిగిపోయాయి. మేకింగ్ పరంగా ఆయన హాలీవుడ్ దర్శకుడు కంటే కూడా గొప్పవాడు అంటూ ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇక ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఓ సంచలన విజయం అందుకుంది. ఫిక్షన్ కథ అయినా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయింది. రిలీజ్ రోజునుంచీ ఇప్పటి వరకూ ఏదో ఒక సందర్భంలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. తారక్, చరణ్, రాజమౌళి, కీరవాణిల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. చెప్పాలంటే ఇటీవల కాలంలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చించుకున్నంతగా ఏ ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోలేదు.
ఈ సినిమాకి దక్కిన అవార్డ్స్, ప్రశంసలు ఊహించనివి. ఇదంతా బాలీవుడ్‌లో కొందరు మేకర్స్‌కి నచ్చడం లేదనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వైరల్ అవుతున్న న్యూస్. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ దక్కిన నేపథ్యంలో మన ఇండియన్ సినీ లవర్స్, తారలు అందరూ సంబరంలో మునిగిపోయారు. ఆర్ఆర్ఆర్ బృందం..మెగా-నందమూరి అభిమానులు మిగతా సౌత్ భాషలలోని ప్రముఖులు, ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో బాలీవుడ్ మేకర్స్‌కి మాత్రం బాగా మండిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ బృందానికి బాలీవుడ్ సెలబ్రిటీస్ గానీ, దర్శకనిర్మాతలు గాని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది లేదని అంటున్నారు. వాస్తవానికి ఇది ఇండియన్ సినిమాకి దక్కిన గౌరవం. కానీ, ఇది బాలీవుడ్ మాత్రం కుళ్ళుతో కుమిలిపోతుందని చెప్పుకుంటున్నారు. పుష్ప సినిమా సక్సెస్ కూడా ఆమధ్య బాలీవుడ్‌లో కొందరు జీర్నించుకోలేకపోయారు. ఇప్పుడు ఆస్కార్ రావడంతో ఇంకా రగిలిపోతున్నారట. సల్మాన్ ఖాన్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయననైనా వారికి పర్సనల్‌గా కాల్ చేసి విష్ చేశారో లేదో తెలియదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.