Orange Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ ఆరంభంలో చేసిన మూడవ చిత్రం ఆరెంజ్. నాగబాబు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రేమ కథని సరికొత్త కోణంలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆవిష్కరించి ఆరెంజ్ సినిమాని ప్రజెంట్ చేశారు. అయితే పదేళ్ల క్రితం ఈ కథ అప్పటి జనరేషన్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రెండో రోజు డిజాస్టర్ ట్రాక్ తెచ్చుకుంది. ఇక నిర్మాతగా నాగబాబు కూడా ఆరెంజ్ సినిమా ఒక పీడకలగా మారింది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఆరెంజ్ పెద్ద ఆటంకం అయ్యింది.. ఈ సినిమా తర్వాత చాలా కాలం బొమ్మరిల్లు భాస్కర్ కి టాలీవుడ్ లో దర్శకుడుగా ఆఫర్స్ రాలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా తర్వాత ప్రేమ కథలు తనకి సెట్ కావని పూర్తిగా విడిచిపెట్టారు.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అదే బ్రాండ్ తో నెక్స్ట్ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేశారు. ఊహించిన విధంగా ఈ సినిమాకి రీ రిలీజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మూడు రోజులు ప్రదర్శించిన ఈ సినిమా ఏకంగా మూడు కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ప్రేక్షకుల కూడా ఈ రీ రిలీజ్ లో ఆరెంజ్ సినిమాని థియేటర్స్ లో చూడడానికి ఆసక్తి చూపించడం విశేషం. కేవలం ఫ్యాన్స్ షోలుగా ఒక్కరోజు మాత్రమే ప్రదర్శిద్దామని అనుకుంటే ఏకంగా మూడు రోజులు ఈ సినిమాని థియేటర్స్ లో ప్రదర్శించే స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.
ఇంకా దీనిపై ఇప్పటికే నాగబాబు కూడా ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ఈ సినిమాకి ఈ స్థాయిలో ఆదరణ రావడం నిజంగా విశేషం అని చెప్పాలి. అప్పటి జనరేషన్ కి అర్థం కాని ఆరెంజ్ సినిమాలో ఎలిమెంట్ ప్రజెంట్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా అడ్వాన్స్ గా ఆలోచించి ప్రేమ కథని మరో దృక్పణంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కరెక్ట్ గా అందులో రామ్ చరణ్ చెప్పే షార్ట్ టైం లవ్ కాన్సెప్ట్ కి కనెక్ట్ కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ ద్వారా వచ్చిన మొత్తం జనసేన రైతు భరోసా కార్యక్రమానికి విరాళంగా ఇస్తానని నాగబాబు ప్రకటించారు. అది కూడా జనసేనకి పరోక్షంగా సహకరిద్దామని అనుకున్న జనసైనికులకు ఆరెంజ్ సినిమా ద్వారా తమ స్థాయిలో హెల్ప్ చేసే అవకాశం దొరికింది అనే మాట వినిపిస్తుంది.