Onions: ఉల్లిపాయలు ప్రతి ఒక్కరి వంటింట్లో ఎప్పుడూ నిల్వ ఉంటాయి ఉల్లిపాయలను వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు ఎంతో రుచి వస్తుంది అందుకే మనం చేసే ప్రతి ఒక్క వంటలో కూడా ఉల్లిపాయ పాత్ర కీలకంగా ఉంటుంది.అయితే ఉల్లిపాయలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెతను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఉల్లిపాయలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అతిగా తిన్నారంటే సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
మరి ఉల్లిపాయను అధికంగా తినడం వల్ల ఏం జరుగుతుందనే విషయానికి వస్తే… ఉల్లిపాయ మితంగా తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్ని కూడా మన శరీరానికి అంది ఎంతో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అలా కాకుండా ఉల్లిపాయలు ఆహారంలో బాగా రుచిగా ఉన్నాయని చాలామంది వంటలలో ఎక్కువ ఉల్లిపాయలు వేయడం లేదా ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు కూడా ఉల్లిపాయలను కట్ చేసుకుని తింటూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు ఎందుకంటే ఉల్లిపాయ సాత్విక ఆహారం కాదు.
Onions:
ఉల్లిపాయలు అధికంగా తినడం వల్ల మనలో కొన్ని ఉద్రేకాలను కలిగిస్తుంది. తద్వారా మనం తొందరగా కోప్పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వాంఛలను కూడా అధికంగా కలిగిస్తుంది. అందుకే వీలైనంతవరకు ఉల్లిపాయలను అధికంగా కాకుండా తక్కువ పరిమాణంలో వాడటం వల్ల మనలో మానసిక ఉద్రేకం తగ్గుతుంది అదేవిధంగా ఉల్లిపాయలు ఉండే ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి.