Devotional Facts: సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామి వారిని దర్శించుకునే సమయంలో స్వామివారికి ఎదురుగా నిలబడి దర్శించుకోము ఒక వైపు నిలబడి స్వామి వారిని దర్శించుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు. ఇలా ప్రతి ఆలయంలో కూడా ఎవరు స్వామివారి మూలవిరాట్ ఎదురుగా నిలబడి దర్శించుకోరు. అలా ఎందుకు దర్శించుకోరు దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనే విషయానికి వస్తే..
స్వామివారి మూలవిరాట్ ఎదురుగా స్వామివారి వాహనాన్ని ఏర్పాటు చేసి ఉంటారు అందుకే మనం మధ్యలో నిలబడి స్వామివారికి ఎదురుగా స్వామివారిని దర్శనం చేసుకోకూడదని చెబుతారు. అదేవిధంగా స్వామివారి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేసే సమయంలో యంత్ర మంత్ర శక్తిని కలిగి ఉంటుంది మనం స్వామివారికి ఎదురుగా నిలబడి ఆ శక్తిని ఎదుర్కోలేము కనుక స్వామివారికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదని చెబుతారు.
అదేవిధంగా స్వామివారి మూల విరాట్ ప్రతిష్టించే సమయంలో మహా మంత్రాలను చదువుతూ ప్రతిష్టించబడుతుంది తద్వారా మూలవిరాట్ కు అతీతమైనటువంటి శక్తులు వస్తాయి. ఇలాంటి శక్తులు పరమేశ్వరుడి ఆలయంలోనూ మహంకాళి ఆలయంలోనూ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలా ఈ ఆలయాలకు వెళ్లినప్పుడు పొరపాటున కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు అంతేకాకుండా స్వామివారి ఆలయంలోకి సూర్యకిరణాలు మూలవిరాట్ పై పడేలా కొన్ని ఆలయాలను ఏర్పాటు చేసి ఉంటారు. మనకు అడ్డుగా నిలబడటం వల్ల ఆ సూర్యకిరణాలు స్వామి వారి మూలవిరాట్ పై పడవు.