OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ (OG). యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి రచనా సహకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందిస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ నటించే సినిమాలలో గురూజీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సాధారణంగా దర్శకుడిని నమ్మి ఫ్రీడం ఇస్తే బద్రి, తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ వస్తాయి.
కానీ, అత్తారింటికి దారేది సినిమా నుంచి పవన్ నటించే సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా స్క్రిప్ట్‌లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మంచి సినిమా కూడా త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఫ్లాపవుతుందని టాక్ ఉంది. పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ (Bandla Ganesh) ల మధ్య దూరం పెరగడానికి ఓ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణం అని చెప్పుకున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ (Nithya Menen) కి సంబంధించిన చాలా సన్నివేశాలు తీసేశారట.
అంతేకాదు, K S చిత్ర (K S Chithra) గారు పాడిన సాంగ్ కూడా నిత్యా మీద అక్కసుతోనే త్రివిక్రమ్ తీసేయించినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో (BRO) సినిమా హిట్ కావాల్సి ఉండగా, త్రివిక్రమ్ కొన్ని మంచి సీన్స్ డిలీట్ చేయించి ఫ్లాప్‌కి కారణం అయ్యాడని అంటున్నారు. ఇదే ఇప్పుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ (OG) సినిమాకి రిపీట్ అవుతుందని సమాచారం.
ఇప్పటికే, రెండు మంచి సీన్స్ ని బలవంతగా మార్పించారట త్రివిక్రమ్. దాంతో సుజీత్ హర్ట్ అయి పవన్ కళ్యాణ్ దృష్ఠికి తీసుకెళ్ళారట. అందుకే, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని కొంచం లిమిట్స్‌లో ఉండమని వార్నింగ్ ఇచ్చారట. మరి ఇందులో నిజమెంత వరకూ ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, ఓజీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్. ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందిస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.