OG MOVIE: పవన్ కళ్యాణ్ కి బాలయ్య తో పోటీ తప్పదా?..

OG MOVIE: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, చిత్రబృందం తాజాగా ‘ఫైర్ స్ట్రోమ్’ అనే తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

‘ఫైర్ స్ట్రోమ్’ సాంగ్ రివ్యూ
పాట విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ అయినప్పటికీ, పాట విన్నాక తమన్ మార్క్ సాధారణ శైలిలో ఉన్నట్లు అనిపించింది. మ్యూజిక్ ఎనర్జిటిక్‌గా ఉన్నప్పటికీ, లిరిక్స్‌ను డామినేట్ చేసినట్లు విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులు పాటను పాజిటివ్‌గా స్వీకరిస్తున్నారు. రానురాను ఈ పాట మరింత ప్రజాదరణ పొందే అవకాశముంది.

‘ఓజీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.

og-movie-will-pawan-kalyan-have-to-compete-with-balayya

OG MOVIE: పవన్, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజు విడుదల

అదే రోజున బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ కూడా విడుదల కానుందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ తప్పదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏదైనా ఒక చిత్రం రిలీజ్ డేట్‌ను మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎం గా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ రిలీజైన హరి హర వీరమల్లు ఒక్క వీఎఫెక్స్ విషయంలో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిందే తప్ప సినిమా మాత్రం అంచనాలని మించి ఉందని అందరూ అభిప్రాయపడ్డారు.

అందుకే, ఓజి..ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలతో తన స్టామినాని చూపించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓజి నుంచి ఇకపై వరుస అప్‌డేట్స్ రానున్నాయి. అలాగే, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ కూడా జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తవుతోంది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

5 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.