OG MOVIE: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, చిత్రబృందం తాజాగా ‘ఫైర్ స్ట్రోమ్’ అనే తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
‘ఫైర్ స్ట్రోమ్’ సాంగ్ రివ్యూ
పాట విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ అయినప్పటికీ, పాట విన్నాక తమన్ మార్క్ సాధారణ శైలిలో ఉన్నట్లు అనిపించింది. మ్యూజిక్ ఎనర్జిటిక్‌గా ఉన్నప్పటికీ, లిరిక్స్‌ను డామినేట్ చేసినట్లు విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులు పాటను పాజిటివ్‌గా స్వీకరిస్తున్నారు. రానురాను ఈ పాట మరింత ప్రజాదరణ పొందే అవకాశముంది.
‘ఓజీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.

OG MOVIE: పవన్, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజు విడుదల
అదే రోజున బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ కూడా విడుదల కానుందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ తప్పదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏదైనా ఒక చిత్రం రిలీజ్ డేట్‌ను మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.
ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎం గా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ రిలీజైన హరి హర వీరమల్లు ఒక్క వీఎఫెక్స్ విషయంలో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిందే తప్ప సినిమా మాత్రం అంచనాలని మించి ఉందని అందరూ అభిప్రాయపడ్డారు.
అందుకే, ఓజి..ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలతో తన స్టామినాని చూపించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓజి నుంచి ఇకపై వరుస అప్‌డేట్స్ రానున్నాయి. అలాగే, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ కూడా జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తవుతోంది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

