NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ మూవీ ఫిక్షనల్ కథాంశంతో ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక తారక్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మూవీ కథని దగ్గరుండి సిద్ధం చేయించారు.
ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యిందనే ప్రచారం గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ద్వారా జాన్వీ కపూర్ ని పుట్టినరోజు విషెస్ చెప్పడంతో పాటు ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుందని కూడా ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ ముద్దుగుమ్మ `జాన్వీ కపూర్ కి ఇదే మొదటి తెలుగు మూవీ కావడం విశేషం. అలాగే ఆమె కెరియర్ లో కూడా ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఇక హిందీలో కూడా ఆమె చేస్తున్న బిగ్ స్టార్ హీరో మూవీ కూడా ఈ చిత్రమే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కోసం జాన్వీ కపూర్ క్యారెక్టర్ లుక్ పై స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ లుక్ ని పోస్టర్ ద్వారా రిలీజ్ చేసి బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.