Nora Fatehi: బాలీవుడ్ గ్లామర్ డాల్ నోరా ఫతేహీ పేరు వినగానే అందరికీ స్పెషల్ సాంగ్స్ గుర్తొస్తాయి. బాలీవుడ్ సినిమాలనే కాకుండా టాలీవుడ్ సినిమాల్లోనూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలోనూ నటిస్తోంది. ఇటీవల హౌస్‌ఫుల్-5 మూవీతో ప్రేక్షకులని అలరించిన నోరా, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది రాయల్స్తోమరోసారి ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద ఏడుస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియోలో నోరా చూడడానికి దిగాలుగా ఉండగా, ఆమెను గుర్తించిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ఆమె దగ్గరకు వెళ్లాడు. ఏడుస్తూ వెళ్తున్న సమయంలో సెల్ఫీ ప్రయత్నం చేయడంపై ఆమె బాడీగార్డ్ వెంటనే స్పందించి ఆ వ్యక్తిని బలంగా పక్కకు లాగి తోసేశాడు. ఇది అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యి నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇంతలోనే నోరా తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆమె పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె ఎందుకు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తోందో మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.

Nora Fatehi: భావోద్వేగ పరిస్థితి అభిమానుల్లో కలవరం కలిగిస్తోంది.
ఈ ఏడాది బీ హ్యాపీ, హౌస్‌ఫుల్-5 సినిమాలతో పాటు, నోరా చివరిసారిగా నటించిన వెబ్ సిరీస్ ది రాయల్స్ కూడా మంచి స్పందన పొందింది. స్పెషల్ డాన్స్ నంబర్లతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, స్ట్రీట్ డాన్సర్ 3డి, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్రాక్, మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల్లో నటించి తన నటనను నిరూపించుకుంది. ప్రస్తుతం నోరా కెరీర్ పిక్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, ఆమె ఇటీవలి భావోద్వేగ పరిస్థితి అభిమానుల్లో కలవరం కలిగిస్తోంది.

