Wed. Jan 21st, 2026

    Nora Fatehi : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఎప్పుడూ తన సార్టోరియల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో తన అభిమానులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఏసింగ్ సీక్విన్డ్ గౌన్‌ల నుండి పవర్ సూట్‌ వరకు సాధారణ ట్విస్ట్‌తో ఎలా ఆదరగొట్టాలో, పండుగ వేల అద్భుతమైన దివాగా ఎలా అందరి మనసులు గెలుచుకోవాలో , నోరాకు తన ఫ్యాషన్ డైరీలను ప్రతి వస్త్రధారణతో ఎలా అప్‌గ్రేడ్ చేయాలో బాగా తెలుసు. నటి తన ప్రతి చిత్రంతో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంది.

    nora-fatehi-glamours-looks-in-monochrome-dress
    nora-fatehi-glamours-looks-in-monochrome-dress

    నోరా,తాజాగా , సొగసైన స్టైలిష్ మోనోక్రోమ్ కో-ఆర్డ్ సెట్‌లో ప్రధాన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది. ఈ నటి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ బాల్‌మైన్‌కు మ్యూజ్‌గా వ్యవహరించింది. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం ఆమె ఫార్మల్ పవర్ సూట్‌ ను ఎన్నుకుంది. నోరా ఈ ప్యాకెడ్ కో-ఆర్డ్ సెట్‌లో తన గ్లామరస్ రూపంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.

    nora-fatehi-glamours-looks-in-monochrome-dress
    nora-fatehi-glamours-looks-in-monochrome-dress

    నోరా మొత్తం నలుపు రేఖాగణిత నమూనాలతో కత్తిరించబడిన మోనోక్రోమ్ టాప్‌ వేసుకుంది. టాప్ పైన సేమ్ డిజైన్స్ తో వచ్చిన ఫుల్ స్లీవ్ సరిపోయే బ్లేజర్ వేసుకుంది. ముందు భాగంలో జిప్పర్‌ అవుట్ ఫిట్ కి ఎఫెక్టివ్ లుక్ ని అందించింది. ఈ టాప్ కి జోడిగా వెడల్పాటి కాళ్లు, ఎత్తైన నడుముతో కూడిన ఫార్మల్ ట్రౌజర్‌ ధరించింది.

    nora-fatehi-glamours-looks-in-monochrome-dress
    nora-fatehi-glamours-looks-in-monochrome-dress

    నోరా ఫతేహీ ఇటీవల అత్యంత ఖరీదైన విదేశీ కారుని కొనుగోలు చేసింది. ఈ కాస్ట్లీ కార్ లో వెనుక భాగంలో నీ సీట్ లో కూర్చుని తన మోనోక్రోమ్ లుక్కుతో క్రేజీ ఫోజులిచ్చి అందరిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ టైట్ ఫిట్ మోనోక్రోమ్ డ్రెస్ లో నోరా తన ఫిగర్లు చూపిస్తూ అదరగొట్టింది. తన ఒంపులతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

    nora-fatehi-glamours-looks-in-monochrome-dress
    nora-fatehi-glamours-looks-in-monochrome-dress

    పాయింటెడ్ టిప్స్‌తో బ్లాక్ లెదర్ బూట్లు వేసుకొని, తన రూపాన్ని మరింత యాక్సెసరైజ్ చేసింది. మినిమల్ మేకప్‌లో, నోరా లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చింది. నటి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ పెట్టుకుని బస్మరైజింగ్ లుక్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

    nora-fatehi-glamours-looks-in-monochrome-dress
    nora-fatehi-glamours-looks-in-monochrome-dress