Nonveg: సాధారణంగా చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈ క్రమంలోనే ప్రతిరోజు నాన్ వెజ్ తప్పనిసరిగా వారి ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉంటారు ఇలా ప్రతిరోజు నాన్వెజ్ తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని భావిస్తుంటారు కానీ ప్రతిరోజు ఇలా మాంసం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మరి ప్రతిరోజు మాంసం తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే…
మాంసాహారం తీసుకుంటే సమృద్ధిగా ప్రోటీన్స్, విటమిన్స్ మినరల్స్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే తాజా పరిస్థితుల దృశ్య మాంసాహారాలైన చికెన్,మటన్ ఎక్కువగా తినేవారిని ప్రమాదకర సూపర్ బగ్ ప్రమాదం వెంటాడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి సూపర్‌బగ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా మనకు మేలు చేస్తే కొన్ని హాని చేస్తాయి.ఇది పరాన్నజీవి జాతిగా చెబుతారు. శరీరంలో ఈ బ్యాక్టీరియా పరిమాణం పెరిగినప్పుడు ఇది మన శరీరంలో యాంటీబయాటిక్ పై ప్రభావం చూపుతుంది. దీనిని యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ స్థితి అంటారు.
ఈ పరిస్థితి గల కారణాలను పరిశీలిస్తే గత మూడు సంవత్సరాలుగా కరోనా తీవ్రత నుండి రక్షణ పొందడానికి యాంటీబయాటిక్స్ మందులను ప్రతి ఒక్కరు ఎక్కువగా వినియోగించారు. ఈ విధంగా యాంటీబయటిక్ ఉపయోగించడమే కాకుండా కరోనా బారిన పడకుండా ఉండడం కోసం అత్యంత పోషక విలువలు కలిగినటువంటి మాంసాహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా జంతువులకు త్వరగా ఎదగడానికి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు, టైలోసిన్ అనే డ్రగ్ వాడుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇలా మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఎక్కువ మొత్తంలో యాంటీబయోటిక్స్ వెళ్తున్నాయని నిపుణులు తెలియజేశారు. అందుకే ప్రతిరోజు మాంసం తినకుండా ఉండడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. మాంసం బదులు అదే స్థాయిలో పోషక విలువలు ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరలను తీసుకోవడం ఎంతో మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.