Non Veg: సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్తే ఎంతో సుచి సుభ్రంగా వెళ్తాము. ఇలా ఆలయానికి వెళ్ళిన సమయంలో ఎలాంటి నీచు పదార్థాలను తాకకుండా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని గుడికి వెళ్లడం జరుగుతుంది అయితే స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా తీపి పదార్థాలను నైవేద్యంగా తయారు చేసుకుని తీసుకువెళ్తాము. అలాగే పులిహోర, పెరుగన్నం,బెల్లంతో తయారు చేసిన అన్నం కూడా స్వామివారికి నైవేద్యంగా మనం తీసుకువెళ్లడం చూస్తుంటాము కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారికి మాంసాహారమే నైవేద్యంగా సమర్పిస్తారు. మరి మాంసం నైవేద్యంగా సమర్పించే ఆలయం ఎక్కడ ఉంది ఏంటి అన్న విషయానికి వస్తే…
అనంతపురం జిల్లా మడకశిరలోని నీలకంఠాపురంలో కొలువై ఉన్నటువంటి నీలకంఠేశ్వరుడి స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.పురాతనమైన ఈ ఆలయంలో నీలకంఠేశ్వరుడు పెద్ద ఎత్తున పూజలు అందుకుంటున్నారు. ఎంతో మహమానిత్వమైనటువంటి ఈ నీలకంఠేశ్వరుడి స్వామి వారిని దర్శించడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇక పరమేశ్వరుడికి ఎక్కువగా తీపితో తయారు చేసిన పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. కానీ నీలకంఠేశ్వరుడు ఆలయంలో అందుకు చాలా భిన్నమని చెప్పాలి.
Non Veg:
ఈ ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తారు.ఇలా మాంసంతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఇక్కడ స్వామివారికి నైవేద్యం. ఈ విధంగా గ్రామస్తులు కూడా స్వామివారికి నైవేద్యంగా మాంసాహార పదార్థాలను తీసుకురావడం గమనార్హం. ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించి నీలకంఠేశ్వరుడిని దర్శించుకుంటారు. సోమవారం కార్తీక మాఘమాసాలలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తుంటారు.