Smart watch: సమయం ఎంతో విలువైంది. అందుకే టైం టు టైం అన్ని పనులు జరగాలని ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాచ్ లను ధరిస్తుంటారు. టైం చూసుకోవాలంటే ఫోన్ లు ఉన్నాయ్ కదా వాచ్ లు ఎందుకు అనుకునేరు. హ్యాండ్ వాచ్ ల పైన ఓ లెవెల్ క్రష్ ఉండేవారు చాలామందే ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే లేటెస్ట్ వర్షన్ వాచ్ లు మార్కెట్ లో కి అందుబాటులోకి వస్తున్నాయ్. తాజగా మార్కెట్ లోకి వచ్చిన స్మార్ట్ వాచ్ Noise colourfit Icon Buzz.
యూనిక్ స్టైల్ కాంబినేషన్స్, ఫంక్షనాలిటీ తో మీరు తలెత్తుకునే ఫీచర్స్ తో ఈ వాచ్ ను డిజైన్ చేశారు. ఈ వాచ్ కు తరచుగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ 7 రోజుల వరకు వస్తుంది. వాచ్ IPC LCD చూసేందుకు చాలా సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లైట్ వెయిట్ తో ఉంటుంది. అలాయ్ తో తయారు చేయబడిన బలమైన బాడీ కలిగి ఉంటుంది. గడియారం ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ బరువు 50 గ్రాములు ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.
నాయిస్ స్మార్ట్‌వాచ్ మిమ్మల్ని ఫిట్‌గా ఉండేలా ప్రేరేపిస్తుంది. మీరు మీ శరీరంలోని కొలెస్ట్రాల్ ను లూస్ అయ్యేందుకు సహాయపడింది. మీరు ఎంత సేపు పడుకుంటున్నారు వంటివి తెలుసుకోవడంతో పాటు, మీ హార్ట్ బీట్ ను ట్రాక్ చేయవచ్చు. స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ V4.0, iOS ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. అలారం, స్టాప్ వాచ్ నోటిఫికేషన్స్ ను అందిస్తుంది. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ యునిక్ వాచ్ ధర రూ. 3999. జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, ఆలివ్ గోల్డ్, మిడ్ నైట్ గోల్డ్ రంగుల్లో ఈ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి.