Technology: ఆండ్రాయిడ్, IOS ఫోన్‌లలో ఎక్కువగా ఉపయోగంలో ఉన్న యాప్ వాట్సాప్. నిత్యం వాట్సాప్ ద్వారా చాటింగ్, స్టాటస్ షేరింగ్, కాలింగ్, వీడియోకాలింగ్ చేయకపోతే సగటు యూజర్‌కు నిద్ర పట్టదు. అంతలా ఈ యాప్ సామాన్యుడి నుంచి ధనికుడి వరకు చేరువయ్యింది. వాట్సాప్ అత్యంత ఉత్తమమైన సేవలను అందిస్తూ ఫ్రెండ్లీ యూజర్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు వాట్సాప్ దాని ఫీచర్లను, గోప్యతను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ యాప్ IOS , ANDROID మద్దతుగా ఉత్తమ వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందించడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ఓల్డర్ OS వర్షన్‌లలో దాని సేవలను నిలిపివేసే సంస్కరణలు చేస్తోంది.
మీరు పాత ఐఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా మీ ఫోన్ iOS పాత వెర్షన్‌లో రన్ అవుతుందా? అదే జరిగితే, మీరు మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలి లేదా iOS యొక్క తాజా వెర్షన్‌కి అప్‌డేట్ అవ్వాలి . ఇది కనుక మీరు చేయకపోతే, మీరు WhatsApp యాక్సెస్‌ను కోల్పోవచ్చు, ఎందుకంటే ఈ దీపావళి నుండి గడువు ముగిసిన ఐఫోన్‌లలో మెసేజింగ్ యాప్ త్వరలో పని చేయడం ఆపివేయబడుతుంది. ఆపిల్ నుంచి ఇటీవల వచ్చిన అప్‌డేట్ ప్రకారం, iOS 10 మరియు iOS 11 డివైజ్‌లలో నడుస్తున్న ఐఫోన్ అక్టోబర్ 24 నుండి WhatsAppకి మద్దతు ఇవ్వడం ఆపేస్తోందని తెలుస్తోంది.
వాట్సాప్ కూడా , iOS 10, iOS 11 ఐఫోన్‌లకు నోటిఫికేషన్‌లను పంపిస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ని కంటిన్యూ చేయడానికి, వినియోగదారులు తమ iOSని అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని చెబుతోంది. వాట్సాప్ హెల్ప్ సెంటర్ పేజ్ ప్రకారం వాట్సాప్ ను ఉపయోగించడం కోసం iOS 12 లేదా అంతకంటే కొత్త వర్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఐఫోన్ 5 ని లేదా ఐఫోన్ 5C ని ఉపయోగించే వినియోగదారులు iOS తో పాటు వాట్సాప్‌ను అప్‌డేట్ చేసిన తరువాతే వాట్సాప్‌ను ఉపయోగించగలరు. ఇక ఐఫోన్ 4, ఐఫోన్ 4C ను వాడే వినియోగదారులు ఇక కొత్త ఫోన్‌లకు షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది . ఎందుకంటే అక్టోబర్ 24 తరువాత ఆ ఫోన్‌లలో వాట్సాప్ సపోర్ట్ ఇవ్వదు.
గోప్యత , వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అప్‌గ్రేడ్ చేయడంలోనే వాట్సాప్ నిరంతరం పనిచేస్తుంది. దాని కోసం, యాపిల్ , ఆండ్రాయిడ్ అందించిన తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌తో సరిపోయే డెవలప్‌మెంట్‌లపై మెసేజింగ్ యాప్ దృష్టి పెడుతుంది. వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్‌లు, పాత OS డివైజ్‌లకు మద్దతు ఇవ్వవు. ఆండ్రాయిడ్ డివైజ్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించడం కొసం ఆండ్రాయిడ్ 4.1 లేదా తదుపరి వెర్షన్‌కు అప్‌డేట్ అవ్వాల్సిందే.