Niveda Thomas: మలయాళీ ముద్దు గుమ్మ నివేదా థామస్ ని సోషల్ మీడియాలో అభిమానులు నీవేదా నీకు పెళ్లా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం తాజాగా ఆమె తన ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడమే. వకీల్ సాబ్, శాకిని ఢానికి చిత్రాల తర్వాత అభిమానులకి, ప్రేక్షకులకి దూరంగా ఉన్నారు నివేదా. అంతకముందు సినిమాలతో సంబంధం లేకపోయినా తన సోదరుడితో కలిసి డాన్స్ వీడియోలను, ఫన్నీ వీడీయోలను పోస్ట్ చేస్తూ అందరికీ టచ్ లో ఉండేవారు.
కానీ, ఎందుకనో సడన్ గా సైలెంట్ అయిపోయింది. ఆ మధ్య నివేదా బాగా లావెక్కినట్టుగా ఒక వీడియో నెట్టింట బాగా చక్కర్లు కొట్టింది. ఈ మధ్యే ఓ కొత్త చిత్రం ఒప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి గానీ, ఎటువంటి క్లారిటీ మాత్రం లేదు. వాస్తవానికి నివేదా మంచి టాలెంటెడ్. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా ప్రదర్శిస్తారు. చేసిన ప్రతీ పాత్ర మంచి పేరు తెచ్చింది. అయినా ఎందుకనో స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయారు.
Niveda Thomas: గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనీ మాట్లాడుకుంటున్నారు.
ఇక తాజాగా నివేదా పెట్టిన పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. చాలా కాలం అయిపోయింది. అయినా చివరికి..అంటూ లవ్ ఏమోజీని జత చేసి రాసుకొచ్చిన పోస్ట్ ని పెట్టారు. దాంతో అభిమానులు, సినీమా లవర్స్ “త్వరలో నివేదా పెళ్లి పీటలెక్కబోతోందని మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనీ మాట్లాడుకుంటున్నారు. కాగా, చిత్ర పరిశ్రమలో మాత్రం ఇప్పటికే నివేదా థామస్ ఒక మల్టీ లాంగ్వేజ్ మూవీ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ అయి ఉండొచ్చుననే ఊహాగానాలు మరోవైపు వినిపించాయి.
అదే ఇప్పుడు నిజం అయింది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో ప్రియదర్శి, విశ్వదేవ్ కీలక పాత్రల్లో టాలీవుడ్ టాల్ హీరో, నిర్మాత రానా దగ్గుబాటి నిర్మాణంలో 35 అనే చిత్రం తయారవుతోంది. చిన్న కథ కాదు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా అప్‌డేట్ ని నివేదా పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ ఆగస్టు 15న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరికొన్ని అప్‌డేట్స్ రానున్నాయి. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకుడు. ఇక సాయి పల్లవి, నిత్యా మేనన్ ల మాదిరిగా కాంప్రమైజ్ కాకపోవడం కథ..అందులో తన పాత్ర నచ్చితేనే సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని అందుకే ఈ గ్యాప్ వచ్చిందనీ చెప్పుకుంటున్నవారు లేకపోలేదు.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.