ఆంధ్రప్రదేశ్ లో గత నెల అనగా ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆగిపోయిన ఆ టీవీ ఛానల్ ప్రసారాలను మళ్లీ పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రశంసిస్తూ న్యూస్ బ్రాడ్ కాస్ట్ ఫెడరేషన్ ప్రకటన చేసింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ ప్రకటన ఆధారంగా చూసుకుంటే.. ఏపీలో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది.
న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని బ్రాడ్ క్యాస్ట్ ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు. జూన్ 6 నుంచి టీవీ9 తెలుగు, సాక్షి టీవీ, ఎన్టీవీ సహా పలు న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు ఏపీలో బ్లాక్‌ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంలో వచ్చిన మార్పు కారణంగా ఈ వార్తా ఛానళ్లను బ్లాక్ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకురావడం తగదు.
టెలివిజన్ వినియోగదారుల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నది అతిపెద్ద మార్కెట్. ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని అంచనా. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తా ఛానెళ్లు కనీసం 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంపై టీవీ9 పిటిషన్ దాఖలు చేస్తూ.. ఛానెల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉంది అని పిటిషన్ లో పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏపీ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్తా చానెళ్లను వీక్షించే హక్కును కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడ్డ వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.